COVID-19: ఐటీ హబ్ లో బెడ్ లు, ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు ఇక్కడే, అలర్ట్ !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) సెకండ్ వేవ్ దెబ్బకు ఐటీ హబ్ బెంగళూరు సిటీ ప్రజలు హడలిపోతున్నారు. కర్ణాటకలో నమోదౌతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 60 శాతానికి పైగా బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బెంగళూరు సిటీలో (BBMP) పరిధిలో ఆక్సిజన్ సిలిండెర్లు, కోవిడ్ అనుమానిత రోగులకు బెడ్ లు, ప్లాస్మా దానం చేసేవారి వివరాలు, కోవిడ్ నివారణకు అందుబాటులో ఉన్న రెమ్ డెసివిర్ వయల్స్ ఇంజక్షన్లు, మందులకు బెంగళూరులో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బీబీఎంపీ పరిధిలో ఇలాంటి సమస్యలు పరిష్కారం కోసం వార్ రూమ్ లు ఏర్పాటు చేశారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Lovers: ప్రియురాలి పెళ్లి ఫిక్స్, ప్రియుడు, ఫ్రెండ్స్ ఏం చేశారంటే ?, ఏకాతంలో వెనుక నుంచి!

800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
కర్ణాటకలో 800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం మా దగ్గర ఉందని కర్ణాటక ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే 200 నుంచి 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని, 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాకు అవసరం ఉందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వం మనవి చేసిందని, అందు వలన ప్రస్తుతానికి కర్ణాటకకు ఆక్సిజన్ కొరత ఏమాత్రం లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ అంటున్నారు.

ఐటీ హబ్ లో ఎక్కడ బెడ్ లు ఖాళీగా ఉన్నాయంటే ?
బెంగళూరు సిటీలో (BBMP) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజ్ లు, కోవిడ్ కేర్ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ -19 అనుమానిత రోగుల కోసం ఎన్ని బెడ్ లు కేటాయించారు, ఎన్ని బెడ్ లు ఖాళీగా ఉన్నాయి, వాటి వివరాలు ఏమిటి అని పూర్తి సమాచారం తెలుసుకోవడానికి bbmpgov.com/chbms లింక్ క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు.

బెంగళూరు 8 కోవిడ్ కేర్ విభాగాలు
బెంగళూరు సిటీ (BBMP) పరిధిలో 8 విభాగాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
*. బెంగళూరు తూర్పు- 2.
*. బెంగళూరు దక్షిణ విభాగం- 2.
*. బెంగళూరు పశ్చిమ విభాగం- 2.
*. బోమ్మనహళ్ళి-1.
* రాజరాజేశ్వరినగర్- 1.
*. దాసరహళ్ళి- 1.
*. మహదేవపుర- 1.
*. యలహంక- 1 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని బీబీఎంపీ అధికారులు అంటున్నారు.
బెంగళూరు కోవిడ్ -19 కేర్ డైరెక్ట్ హెల్త్ లైన్
కర్ణాటక ఆరోగ్య శాఖ, బీబీఎంపీ కోవిడ్ కేర్ హెల్త్ లైన్ నెంబర్ 1912 ను కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించింది. కోవిడ్ -19 అనుమానిత రోగులు మందుల కోసం 14419 నెంబర్ కు ఫోన్ చెయ్యాలని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. కోవిడ్ -19 అనుమానిత రోగులను వెంటనే ఆసుపత్రులకు తరలించడానికి 108 అంబులెన్స్ హెల్త్ లైన్ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

అందుకేనా
బెంగళూరు ప్రజల కోసం హెల్త్ లైన్ నెంబర్లు
*. బెంగళూరు తూర్పు విభాగం: 7411038024/ 9886496295.
*. బెంగళూరు పశ్చిమ విభాగం: 080 - 68248454
*. బెంగళూరు దక్షిణ విభాగం: 8431816718
*. మహదేవపుర విభాగం: 080 -23010101/ 23010102
*. బోమ్మనహళ్ళి విభాగం: 8884666670
*. యలహంక విభాగం: 9480685964
*. రాజరాజేశ్వరినగర విభాగం: : 080 - 28601050
*. దాసరహళ్ళి విభాగం: 080 - 29590057/ 29635904/ 5906

రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ లు ఎక్కడ రెఢీగా ఉంన్నాయంటే !
బెంగళూరు నగరంలో రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉండే ఆసుపత్రలు వివరాలను బీబీఎంపీ అధికారులు విడుదల చేశారు. ఈ కింది లిస్ట్ లోని ఆసుపత్రుల్లో గతంలో రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు ప్రజలకు రూ. 2, 800 నుంచి రూ. 5, 400 ధరను నిర్ణయించారు. అయితే ఇప్పుడు ప్రజలకు ఈ ఇంజక్షన్ లు రూ. 899 నుంచి రూ. 3, 490 లకే అందుబాటులోకి వచ్చాయి.