ఫలితాలు: గెహ్లాట్ రిజైన్, షీలాపై కేజ్రీవాల్ గెలుపు

న్యూఢిల్లీ: ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గడ్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. మిజోరం ఫలితాలు ఈ నెల 9వ తేదీన వెలువడనున్నాయి. లైవ్ అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

- రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేశారు. ఆయన ఓటమిని అంగీకరించారు.

- షీలా దీక్షిత్‌పై సామాన్యుడు అర్వింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. షీలా దీక్షిత్‌పై 8 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

- రాజస్థాన్‌లోని 12 జిల్లాల్లో కాంగ్రెసు పార్టీ ఖాతా తెరవలేదు.

 Counting for elections to 4 states begins

- శాసనసభ ఎన్నికల్లో ఓటమికి రాహుల్ గాంధీ బాధ్యుడు కారని, ఓటమికి రాహుల్ గాంధీని నిందించడం సరి కాదని రాజీవ్ శుక్లా అన్నారు.

- తాము ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు.

- ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటింది. పార్టీ పెట్టిన ఏడాదిలోనే గణనీయమైన సీట్లు సాధించింది.

- రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓటమిని అంగీకరించారు.

- రాజస్థాన్‌లో బిజెపి చారిత్రిక విజయం సాధించిందని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో రాశారు. వసుంధర రాజే సింధియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించినందుకు శివరాజ్ సింగ్ చౌహన్‌కు మోడీ అభినందనలు తెలిపారు.

- ఢిల్లీలో పరాజయం ఖాయం కావడంతో ముఖ్యమంత్రి పదవికి షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. కాంగ్రెసు పార్టీ మూడో స్థానంలో కొనసాగుతోంది. దీంతో 16 ఏళ్ల షీలా దీక్షిత్ ఢిల్లీ పాలనకు తెరపడింది.

- నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయం కావడంతో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

- రాజస్థాన్‌లో తమ విజయానికి నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ పనిచేసిందని బిజెపి నాయకురాలు, ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా అన్నారు.

- రాజస్థాన్‌లోని తన నియోజకవర్గం జైరాపటాన్‌లో వసుంధ రాజే సింధియా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.

- రాజస్థాన్ ముఖ్యిమంత్రి, కాంగ్రెసు అభ్యర్థి అశోక్ గెహ్లాట్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రామనంద్‌గావ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- ఆమ్ ఆద్మీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయంలో ధ్యానం చేస్తున్నారు. బిజెపి ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వెనకంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు.

- మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో హ్యాట్రిక్ దిశగా బిజెపి సాగుతోంది. బిజెపి 143 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెసు 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

- ఢిల్లీలో మొదటి స్థానంలో బిజెపి కొనసాగుతుందడా, ఆమ్ ఆద్మీ రెండో స్థానంలో, కాంగ్రెసు మూడో స్థానంలో సాగుతున్నాయి.

- రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి దూసుకుపోతోంది. బిజెపి 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెసు కేవలం పది స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

- ఢిల్లీలో ఐదు స్థానాల్లో బిఎస్పీ ఆధిక్యతలో ఉంది.

- న్యూఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆధిక్యంలో సాగుతున్నారు.

- రాజస్థాన్‌లో బిజెపి దూసుకుపోతోంది. రాజస్థాన్ శాసనసభలో 199 సీట్లు ఉన్నాయి. 17 స్థానాల్లో బిజెపి ఆధిక్యతలో ఉండగా, ఐదు స్థానాల్లో మాత్రమే కాంగ్రెసు ఆధిక్యతలో కొనసాగుతోంది

- మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బిజెపి ప్రారంభంలో లీడ్స్‌లో ఆధిక్యకత ప్రదర్శిస్తోంది.

- ఢిల్లీలోని ఓ సీటులో ఆమ్ ఆద్మీ ఆధిక్యంలో ఉంది.

ఛత్తీస్‌గఢ్ (90 సీట్లు)లో కాంగ్రెసు (7), బిజెపి (7) పోటాపోటీగా ఆధిక్యతను సాధిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+