• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశానికి ఇక వీళ్లంతా అక్కర్లేదు... అవినీతి పరులను జైలుకు పంపడం ఖాయం: మోడీ

|

ఢిల్లీ: దేశానికి ఇక రాజాలు మహారాజాలు అక్కర్లేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. న్యూఢిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో ఏర్పాటు చేసిన మై భీ చౌకీదార్ కార్యక్రమంలో మోడీ పాల్గొని ప్రసంగించారు. చౌకీదార్ అనే పదం వెనకు ఉన్న అసలైన అర్థం దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నందున తనకు చాలా సంతోషంగా ఉందని మోడీ అన్నారు. ఇప్పటి వరకు అవినీతి పరులను జైలు వరకు మాత్రమే తీసుకెళ్లానని చెప్పిన ప్రధాని 2019 ఎన్నికల తర్వాత వారిని శాశ్వతంగా జైలుకే పరిమితం చేస్తానని చెప్పారు.

Country doesnt need more rajas, maharajas says Modi

కొందరికి చౌకీదార్ పట్ల అవగాహన లేదని... వారు కేవలం టోపీ, యూనిఫాం, విజిల్ వేసుకుని ఉంటారని అనుకుంటారని చెప్పిన ప్రధాని వారు అంతవరకే ఆలోచిస్తారన్నారు. ఇక చౌకీదార్ తన వృత్తిని ఎలా నిర్వహిస్తారో అనేదానిపై అవగాహన లేదని అందుకే చౌకీదార్‌పై విశ్వాసం లేదని దుయ్యబట్టారు ప్రధాని. ఇక భారత ఆర్మీ పట్ల తనకు అపారమైన విశ్వాసం, గౌరవం ఉన్నాయని దేశం తలదించుకునేలా ఎప్పుడూ వారు వ్యవహరించరని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా దేశం నుంచి దేశ ప్రజల నుంచి మంచి మద్దతు లభించిందని అన్నారు. "ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక చౌకీదారే. ఈరోజు కాస్త సమయం గడపాలని భావిస్తున్నాను. 2019లో ప్రతి చౌకీదార్ తనతో కలిసి పోరాడుతున్నారు. దేశ ప్రజలంతా చౌకీదారులుగానే నేను భావిస్తాను" అని మోడీ అన్నారు.

బాలాకోట్ దాడులు ఒకవేళ విజయవంతం కాకపోయి ఉంటే మీరేమి చేసేవారని ఒకరు ప్రధానిని ప్రశ్నించారు. బాలాకోట్ దాడులు చేసింది తాను కాదని దేశ జవాన్లు వారికి ఈ సందర్భంలో తాను సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. "బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలు లేవని పాకిస్తాన్ వాదిస్తోంది. ఇప్పుడేమో ఆ శిబిరాలు బయట ప్రపంచంకు కనిపించకుండా దాచేస్తున్నారు. అక్కడికి ఎవరినీ రానివ్వడం లేదు. అంతేకాదు అక్కడ ఓ స్కూలు నిర్మాణం చేసి బయట ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. స్కూలు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ పాఠశాల నడుస్తుందని కొత్త కథ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు నా దగ్గర సమాచారం ఉంది" అని మోడీ చెప్పారు. పాకిస్తాన్ పెద్ద డైలామాలో ఉందని ....బాలాకోట్‌ దాడులు జరిగాయని ఒప్పుకుంటే తమ పరువు బజారును పడుతుందనే ఆలోచనతో పాక్ ఉందని ప్రధాని అన్నారు. బాలాకోట్‌ దాడులపై ఎవరైతే తనను విమర్శిస్తున్నారో వారు పరోక్షంగా పాకిస్తాన్‌కు సహకరిస్తున్నారని మోడీ చెప్పారు.

ఇక దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని తమ ప్రభుత్వం తిరిగి రప్పిస్తోందని చెప్పారు. వారు ప్రతి పైసా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇక పాకిస్తాన్ గురించి ఎంత తక్కువగ మాట్లాడితే అంత మంచిదన్న మోడీ ఆ దేశం తన పాపాన అదే నాశనమవుతుందని చెప్పారు. అమెరికా, చైనా దేశాలు దాడులు చేస్తే బహిరంగంగా చేసినప్పుడు భారత్ మాత్రం రహస్యంగా దాడులు ఎందుకు చేయాలని మోడీ ప్రశ్నించారు.

English summary
Speaking at a town hall meeting in Talkatora Stadium in New Delhi, Prime Minister Narendra Modi today said the country does not need more rajas and maharajas.Responding to a question,PM Modi said, "Country does not need rajas and maharajas. It makes me happy that the spirit behind chowkidar is expanding. I have taken the corrupt to jail till now. After 2019, they will be behind bars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X