స్వలింగసంపర్కం నేరం కాదన్న సుప్రీం తీర్పును స్వాగతించిన కరణ్ జోహార్
స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై దేశవ్యాప్తంగా ఉన్న స్వలింగసంపర్కులు సంబరాలు చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పలువురు సెలబ్రిటీలు కూడా స్వాగతించారు. ఇందులో ముందువరసలో నిలిచారు బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్. ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు చెప్పిన మరుక్షణమే బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ట్విటర్ వేదికగా స్పందించారు.
Recommended Video

"స్వలింగ సంపర్కం నేరం కాదని చారిత్రాత్మక తీర్పును సుప్రీం కోర్టు ఇవ్వడం చాలా ఆనందం కలిగించింది. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. ఐపీసీ 377ను రద్దు చేయడం మానవాళికి, సమానహక్కులకు గొప్ప విజయం. దేశానికి తిరిగి ఆక్సిజన్ లభించింది" అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. కరణ్ ట్వీట్‌ను మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఫాలో అయ్యారు. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, వరుణ్ ధవన్, స్వరభాస్కర్, రిచా చడ్డా, దియా మీర్జా, విక్కీ కౌషల్, ఆయుష్మాన్ ఖురాన్‌లాంటి సెలబ్రిటీలు ఫాలో అయ్యారు.

ప్రజలు స్వలింగసంపర్కం గురించి మాట్లాడుకుంటున్నారని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. మనదేశంలో కూడా కొంతమంది పనికొచ్చే నిర్ణయాలు చేస్తుండంటం సంతోషించదగ్గ విషయం అని ఈ తరం అలాంటి వారిని చూస్తోందని అర్జున్ కపూర్ ట్వీట్ చేశారు. ఎప్పుడో 1860లో ఉన్న చట్టం రద్దు అయ్యింది. దేశం మొత్తం గర్వపడే విషయమని చెబుతూ .... సెక్షన్ 377కు గుడ్‌బై చెప్పారు వరుణ్ ధవన్. ఐపీసీ సెక్షన్ 377 రద్దు చేయాలని పోరాడి విజయం సాధించిన వారికి నటి స్వరభాస్కర్ అభినందనలు తెలిపారు. వారి పోరాట ఫలితమే నేడు 377 సెక్షన్ రద్దయిందని ట్వీట్ చేసింది. ఈ రోజు కొత్త సూర్యుడు ఉదయించాడని భారత్ ప్రగతిలో ముందుకు దూసుకెళుతుందని అయుష్మాన్ ఖురానా ట్వీట్ చేశారు.
Historical judgment!!!! So proud today! Decriminalising homosexuality and abolishing #Section377 is a huge thumbs up for humanity and equal rights! The country gets its oxygen back! 👍👍👍💪💪💪🙏🙏🙏 pic.twitter.com/ZOXwKmKDp5
— Karan Johar (@karanjohar) September 6, 2018
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications