వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కపుల్ ఛాలెంజ్,బ్యూటీఫుల్ డాటర్ ఛాలెంజ్..ఆ ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీల సైట్లలో..సైబర్ క్రైం హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లను ఇప్పుడు రకరకాల ఛాలెంజ్ లు ఊపేస్తున్నాయి. ఫేస్ బుక్ లో ఈ మధ్య కాలంలో విపరీతంగా ప్రచారం అవుతున్న కపుల్ ఛాలెంజ్ లో చాలా మంది భార్యాభర్తలు తమ ఫోటోలు పెడుతున్నారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్ మీద పోస్ట్ చేసే ఫోటోలతో సైబర్ నేరగాళ్లు వివిధ సైబర్ నేరాలకు పాల్పడవచ్చని హెచ్చరిస్తున్నారు.

పోలీసులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్ళు .... ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్లు .. తస్మాత్ జాగ్రత్త !!పోలీసులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్ళు .... ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్లు .. తస్మాత్ జాగ్రత్త !!

కపుల్ ఛాలెంజ్ , బెస్ట్ డాటర్ ఛాలెంజ్ ఇలా సోషల్ మీడియాలో హల్ చల్

కపుల్ ఛాలెంజ్ , బెస్ట్ డాటర్ ఛాలెంజ్ ఇలా సోషల్ మీడియాలో హల్ చల్

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తమ జీవిత భాగస్వామితో కలిసి దిగిన ఫోటోలను కపుల్ చాలెంజ్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ ధోరణి పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఒక్క కపుల్ ఛాలెంజ్ మాత్రమే కాదు, బ్యూటీఫుల్ డాటర్ ఛాలెంజ్, ప్రొఫెషనల్ ఛాలెంజ్ ఇలా రకరకాల చాలెంజ్ లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి . ఇదే అదునుగా చూసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది .

 ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీల వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేసే అవకాశం

ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీల వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేసే అవకాశం

ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ ల ద్వారా ఫొటోలను ఎడిట్ చేసి వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. పోర్న్ సైట్ లలో ఆ ఫోటోలను అప్లోడ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరస్తులు పలువురు ఫేస్ బుక్ అకౌంట్స్ ను హ్యాక్ చేస్తున్నారు. నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను తెరుస్తున్నారు. డబ్బులు కావాలి అంటూ ఫ్రెండ్ లిస్టు లో ఉన్నవారికి మెసేజ్ లు పంపుతున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల బాధితులుగా పోలీసులు కూడా ఉన్న పరిస్థితి ఉంది.

 సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు .. జాగ్రత్త .. సైబర్ క్రైం హెచ్చరిక

సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు .. జాగ్రత్త .. సైబర్ క్రైం హెచ్చరిక

ఇటువంటి సమయంలో కపుల్ ఛాలెంజ్, బ్యూటీఫుల్ డాటర్ చాలెంజ్, సింగర్ చాలెంజ్, ప్రొఫెషనల్ చాలెంజ్ అంటూ రకరకాల చాలెంజ్ ల పేరుతో సైబర్ మోసాలకు తెర తీసే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. అందుకే మీరు మీ భాగస్వామితో ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు సైబర్ పోలీసులు. ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కపుల్ ఛాలెంజ్ అనే హ్యాష్ ట్యాగ్ క్రింద జీవిత భాగస్వాములతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్న వారు అప్రమత్తంగా లేకుంటే ఇబ్బంది పడతారని అంటున్నారు . అశ్లీల సైట్ల కోసం ఈ ఫోటోలను మార్ఫింగ్ చేసి వాడే అవకాశం ఉందని చెప్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలకు నో సేఫ్టీ ... రిస్క్ లో పడొద్దని వార్నింగ్

సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలకు నో సేఫ్టీ ... రిస్క్ లో పడొద్దని వార్నింగ్

ఈ ఫోటోలను ఉపయోగించి రివెంజ్ పోర్న్ , డీప్ ఫేక్ మొదలైన సైబర్ క్రైమ్స్ కి పాల్పడవచ్చని అంటున్నారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో నో సేఫ్టీ అని ఇప్పటికే పదేపదే చెబుతున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే చాలా మంది తమ ఫోటోలు దుర్వినియోగం అయ్యాయని, మార్ఫ్ చేసి అశ్లీల వెబ్ సైట్లలో అప్లోడ్ చేశారని ఫిర్యాదులు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకునే టప్పుడు జాగ్రత్త వహించాలి అంటూ హెచ్చరిస్తున్నారు. నేరస్తులు బాధితులను బ్లాక్ మెయిల్ చేయడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి, లేదా వారి ఫోటోలను వినియోగించటం ద్వారా ఆర్థిక లాభం పొందటానికి ప్రయత్నాలు చేయవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు. అందుకే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.

English summary
The latest trend to take the internet by storm is the ‘Couple Challenge’, where thousands of people from around the world have been sharing photographs with their partners or spouses on Twitter, Instagram and other social media platforms.But the seemingly innocent new social media challenge has prompted law enforcement authorities in India to warn users against sharing their images online after receiving complaints from people whose pictures and personal information were misused by cyber criminals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X