తీర్పు: భార్యకు ఇష్టం లేకున్నా లైంగిక చర్య ‘రేప్’ కాదు

ప్రాసిక్యూషన్‌కు ఆ మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. 2013, మార్చి 4న ఢిల్లీకి చెందిన వికాస్ అనే వ్యక్తి తన భార్యకు మత్తు మందు ఇచ్చి ఆమెను ఘజియాబాద్ కోర్టులోని పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. ఆమెతో వివాహ పత్రాలపై సంతకం చేయించుకున్నాడు. ఆ వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకున్న తర్వాత తన భార్యపై లైంగిక చర్యకు పాల్పడి వదిలేశాడు. దీంతో ఆ మహిళ నైరుతి ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో భర్తపై(అక్టోబర్ 2013న) ఫిర్యాదు చేసింది.
కాగా, వికాస్ మాత్రం తమకు 2011, ఫిబ్రవరి 2నే వివాహం జరిగిందని, తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని భావించి తాను తన భార్యను ఘజియాబాద్ కోర్టుకు తీసుకెళ్లానని చెప్పాడు. తన సోదరి పేరున ఉన్న ఇంటిని తన పేరున మార్చేందుకు తాను అంగీకరించకపోవడంతో తన భార్య అత్యాచార ఆరోపణలు చేస్తోందని తెలిపాడు.
‘బాధితురాలు(భార్య), నిందితుడు (వికాస్) ఇద్దరు చట్టప్రకారం భార్యాభర్తలు. బాధితురాలు కూడా మేజర్. వీరిద్ధరి మధ్య లైంగిక చర్య అత్యాచారం కిందకు రాదు. అది బాధితురాలి అంగీకారం లేకుండా జరిగినా. దీని ఆధారంగా నిందితుడిపై అభియోగాలు మోపలేం' అని ఇరుపక్షాల వాదన విన్న న్యాయమూర్తి వీరేందర్ భట్ మే 7న తమ తీర్పులో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications