హిందూ అమ్మాయి-ముస్లిం అబ్బాయి.. సహజీవనానికి కోర్టు గ్రీన్ సిగ్నల్

Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్ : సహజీవనానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ పెళ్లి కాని జంటకు సహజీవనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అబ్బాయి వయసు ప్రస్తుతం 20 సంవత్సరాలు మాత్రమే కావడంతో.. సంవత్సరం పాటు సహజీవనానికి అనుమతిస్తూ.. అనంతరం అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా అబ్బాయితో అఫిడవిట్ దాఖలు చేయించారు.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని పాకిస్థాన్ సరిహద్దు గ్రామం ధనేరాకు చెందిన ముస్లిం యువకుడు (20), తన క్లాస్ మేట్ అయిన ఓ హిందూ అమ్మాయి (19) ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే గత జూలైలో వీరిద్దరు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అబ్బాయి మైనర్ కావడంతో అది సాధ్యపడలేదు.

Court lets Hindu girl live with Muslim boyfriend

దీంతో పెళ్లయ్యేంత వరకు ఇద్దరు కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఉంటూ వస్తున్నారు. అయితే విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో.. వారు ఉంటున్న ప్రాంతానికి వచ్చి యువతిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. ప్రియురాలిని వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లడంతో న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లెక్కాడు యువకుడు.

అతని పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. అతని ప్రియురాలిని కోర్టుకు పిలిపించింది. ఈ సందర్బంగా.. ప్రియుడితో ఉంటానని కోర్టుకు వ్యక్తం చేసింది. వాదనలు ముగిసిన తర్వాత.. అమ్మాయికి ఇష్టమైన చోట ఉండే హక్కు ఉందని.. తనకు ఇష్టమైతే 20ఏళ్ల యువకుడితో సహజీవనం చేయొచ్చునని తీర్పు చెప్పింది. అయితే సదరు ముస్లిం యువకుడికి 21ఏళ్లు నిండగానే యువతిని పెళ్లి చేసుకోవాలని అతని చేత అఫిడవిట్ దాఖలు చేయించడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gujarat high court permitted a 19-year-old Hindu girl to live-in with her Muslim boyfriend, who is just 20 years old and is currently ineligible for marriage.
Please Wait while comments are loading...