వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Covaxin: ఎయిమ్స్ లో పిల్లలపై కోవ్యాక్సిన్ ప్రయోగాలు, కరోనా థర్డ్ వేవ్, ఫలితాలపైనే ఆశలు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం పిల్లల మీద ఎక్కువగా చూపిస్తుందని నిపుణులు హెచ్చరించిన సందర్బంలో పిల్లల మీద కోవ్యాక్సిన్ ప్రయోగం ప్రారంభం అయ్యింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో 2 ఏళ్ల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవ్యాక్సిన్ ను ఎయిమ్స్ ఆసుపత్రిలో పిల్లల మీద ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే బీహార్ లోని పాట్నాలోని ఎయిమ్స్ లో పిల్లల మీద కోవ్యాక్సిన్ ప్రయోగించారు. ఢిల్లీ ఎయిమ్స్ లో పిల్లలకు పరీక్షలు నిర్వహించిన తరువాత వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు.

ICU Bed: మత్తుమందు ఇచ్చి యవతి మీద రేప్, వార్డుబాయ్ అరాచకం, విషం ఇంజక్షన్ తో చంపేస్తా !ICU Bed: మత్తుమందు ఇచ్చి యవతి మీద రేప్, వార్డుబాయ్ అరాచకం, విషం ఇంజక్షన్ తో చంపేస్తా !

 525 మంది వాలంటీర్లపై ప్రయోగం

525 మంది వాలంటీర్లపై ప్రయోగం

ఆరోగ్యవంతంగా ఉన్న 525 మంది వాలంటీర్లకు పరీక్షలు నిర్వహించిన తరువాత కోవ్యాక్సిన్ ను ప్రయోగిస్తున్నారు. 28 రోజుల తరువాత రెండో డోస్ ను ఇంట్రామస్కులర్ పద్దతిలో మరోసారి వెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎయిమ్స్ అధికారులు అంటున్నారు. ఈ పరీక్షలు విజయవంతం అయిన తరువత దేశవ్యాప్తంగా చిన్న పిల్లలకు వ్యాక్సిన్ వెయ్యాలని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు.

 విజయవంతం అవుతుంది !

విజయవంతం అవుతుంది !

2 సంవత్సరాల నుంచి 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు ఎయిమ్స్ లో నిర్వహిస్తున్న కోవ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతం అవుతుందని అక్కడి వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల మీద ప్రయోగిస్తున్న కోవ్యాక్సిన్ పరీక్షల ఫలితాలు వచ్చిన తరువాత మిగిలిన వారికి కోవ్యాక్సిన్ వెయ్యడానికి చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.

 తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 15 రోజుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గడంతో ప్రజలు కొంచెం ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ లాక్ డౌన్ అమలులో ఉంది. చిన్నపిల్లలకు వేస్తున్న కోవ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇస్తే దేశవ్యాప్తంగా పిల్లలకు కోవ్యాక్సిన్ వేసే ప్రక్రియ మొదలౌతుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

English summary
Covaxin: Delhi AIIMS to begin conducting trials of Covaxin on children from today. The trial is to be conducted on 525 healthy volunteers. In the trial, the vaccine will be given by intramuscular route in two doses at day 0 and day 28. The screening of children for conducting trial of Covaxin has started.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X