హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్‌పైనా కోవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తోంది: ఐసీఎంఆర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మనదేశానికి చెందిన భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్.. కరోనా డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్‌పై సమర్థంగా పనిచేస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) బుధవారం ప్రకటించింది. సార్స్‌కోవ్-2, దానిలో కొత్తగా వచ్చిన మ్యూటెంట్ రకాన్ని కూడా అడ్డుకుంటోందని తెలిపింది.

యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లను విజయవంతంగా కల్చర్ చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. యూకే, బ్రెజిల్ వేరియంట్లను కూడా కోవాగ్జిన్ బలంగా నిలువరించినట్లు తెలిపింది. అంతేగాక, ఇటీవలే భారత్‌లో కనిపిస్తున్న డబుల్ మ్యూటెంట్ రకాన్ని కూడా బందించి పరీక్షలు నిర్వహించింది. దీనిపై కూడా కోవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని ఐసీఎంఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

 Covaxin neutralises double mutant strain: ICMR study

కరోనా టీకా తీసుకున్నా ఇన్ఫెక్షన్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే కరోనా టీకా ఊపరితిత్తుల కింద భాగాన్నే వైరస్ నుంచి రక్షిస్తుందని, పై భాగాన్ని కాదని తెలిపారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరనావైరస్ శరీరంలోకి ప్రవేవించినా.. ప్రాణాంతకంగా మారకుండా ఉంటుందని కృష్ణ ఎల్లా వివరించారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్పప్పటికీ.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరి అని కృష్ణ ఎల్లా తెలిపారు. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తయారీని కూడా గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. ఏడాదికి 70 కోట్ల డోసుల కోవాగ్జిన్ టీకా తయారీ సామర్థ్యం జులై-ఆగస్టుకుసమకూరుతుందని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. హైదరాబాద్ తోపాటు బెంగళూరు యూనిట్‌లోనూ వ్యాక్సిన్ల తయారీ వేగంగా జరుగుతోందని వివరించింది.

Recommended Video

NTR Is The Vaccine For CBN, Lokesh Viruses ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ వేయించుకోండి || Oneindia Telugu

English summary
Indigenously-developed Covid-19 vaccine Covaxin neutralises multiple variants of SARS-CoV-2 and effectively neutralises the double mutant strain as well, the Indian Council of Medical Research (ICMR) said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X