కోవాగ్జిన్ మూడోదశ ప్రయోగాల ఫలితాలు జులైలోనే: భారత్ బయోటెక్, ‘కోవిషీల్డ్ అడ్వంటేజ్ ట్రాష్’
న్యూఢిల్లీ/హైదరాబాద్: కోవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను జులైలో బహిరంగ పరుస్తామని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో)కు ఈ డేటాను మొదట సమర్పిస్తామని, ఆ తర్వాత వాటిని రివ్యూ జర్నల్స్‌కు అందిస్తామని వెల్లడించింది. మూడో దశ అధ్యయన తుది విశ్లేషణ డేటా అందుబాటులోకి వచ్చాక కోవాగ్జిన్ పూర్తి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటామని భారత్ బయోటెక్ తెలిపింది.
మరోవైపు భారత్‌లోకరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రతకు కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్ నుంచి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ), భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. డెల్టాతోపాటు బీటా వేరియంట్ నూ కోవాగ్జిన్ సమర్థంగా ఎదుర్కొంటుందని ఈ అధ్యయనం తేల్చింది.

కాగా, కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ టీకానే అధికంగా యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తోందని ఓ జర్నల్‌లో ప్రచురితమైన నివేదికలో అనేక లోపాలున్నాయని భారత్ బయోటెక్ పేర్కొంది. కోవాగ్జిన్ టీకాను కోవిషీల్డ్‌తో.. ప్రచురించిన ఈ కథనాన్ని భారత్ బయోటెక్ కొట్టిపారేసింది. ఒకటి, రెండు డోసుల తర్వాత భారత్ బయోటెక్ టీకాలపై వెలువరించిన ఆ నివేదికలో చాలా లోపాలున్నాయని తెలిపింది.
దేశంలో కోవిషీల్డ్ తోపాటు కోవాగ్జిన్ టీకాలను జనవరి నుంచి ప్రజలకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ రెండు వ్యాక్సిన్లను దేశంలోని 24 కోట్ల మందికి ఇచ్చారు. అత్యవసర వినియోగానికి అనుమతివ్వడంతోనే ఈ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నారు. తాజాగా, రష్యాకు చెందిన స్పుత్నిక్ వీని కూడా మనదేశంలో వినియోగం ప్రారంభించారు.
దేశంలోని 18ఏళ్లు నిండినవారందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఈ మూడు వ్యాక్సిన్ల ధరలను నిర్ధారించింది. ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసే కరోనా వ్యాక్సిన్ల ధరలను ప్రకటించింది. కోవిషీల్డ్ షాట్‌కు రూ. 780, కోవాగ్జిన్ టీకాకు రూ. 1410, స్పుత్నిక్ వీ డోసుకు రూ. 1145 గా ధరలను నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.












Click it and Unblock the Notifications