గుడ్‌న్యూస్: గుజరాత్‌లో కోవాక్సిన్ ఉత్పత్తి, భారత్ బయోటెక్ ప్రకటన
కరోనా వ్యాక్సిన్ కొరత ఉంది. వైరస్ నిర్మూలన టీకాల వల్లే సాధ్యం అవుతోంది. దీంతో వ్యాక్సిన్ కావాలనే డిమాండ్ వస్తోంది. కరోనా వ్యాక్సిన్ డిమాండ్‌ను అందుకునేందుకు కొవాగ్జిన్ సృష్టికర్త భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం కొవాగ్జిన్ హైదరాబాదు, బెంగళూరు నగరాల్లో మాత్రమే ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇకపై ఇకపై గుజరాత్ లోనూ ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతోంది. అంక్లేశ్వర్ లోని చిరోన్ బెహ్రింగ్ వ్యాక్సిన్ కేంద్రంలోనూ కొవాగ్జిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నట్టు భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది. అంక్లేశ్వర్ లోని వ్యాక్సిన్ కేంద్రం నుంచి ఈ ఏడాది నాలుగో త్రైమాసికం నాటికి ఉత్పత్తి ప్రారంభం కానుంది.

కొవాగ్జిన్ టీకా ప్రత్యేకత కారణంగా దీన్ని ఉత్పత్తి చేయడానికి బీఎస్ఎల్-3 ప్రమాణాలు ఉన్న ల్యాబ్ లు అవసరం అవుతాయి. కాగా, తమ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాల సంఖ్య మూడుకు పెరిగిన నేపథ్యంలో, ఏడాదికి వంద కోట్ల డోసులు ఉత్పత్తి సాధ్యమేనని భారత్ బయోటెక్ భావిస్తోంది. దేశంలో ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల యువకుల నుంచి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పినా.. అదీ క్షేత్రస్థాయిలో అమలు అయినట్టు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అమలు కాలేదు.
Recommended Video
ఇప్పుడు భారత్‌లో సెకండ్ వేవ్ నడుస్తోంది. అక్టోబర్‌లో థర్డ్ వేవ్ అంటున్నారు. ఇదీ చిన్న పిల్లలపై ప్రభావం చూపించనుంది. మళ్లీ మార్చిలో ఫోర్త్ వేవ్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంటే కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందే. మాస్క్ ధరిస్తూ.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి విరుగుడు టీకాలే. అయితే అవీ కూడా 6 నెలల వరకే పనిచేస్తాయని చెప్పడం కాస్త ఆందోళన కలిగించే అంశంగా మారింది.












Click it and Unblock the Notifications