కరోనా డేంజర్ బెల్స్ - అప్రమత్తంగా ఉండాల్సిందే..!!

మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజూవారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొత్తగా 6,050 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వైరస్ వల్ల మరో 14 మరణించారు. ఇప్పటి వరకు కొవిడ్​తో మరణించిన వారి సంఖ్య 5,30,943కు చేరింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కు చేరింది. వరుసగా ప్రతీ రోజు కేసుల సంఖ్య పెరగటం పైన కేంద్రం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో ఈ రోజు కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహిస్తోంది. కొత్త మార్గదర్శకాల జారీకి సిద్దమైంది.

కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 1,78,533 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఏకంగా 6,050 కేసులు బయటపడ్డాయి. ఇది నిన్నటితో పోలిస్తే 13 శాతం ఎక్కువ. గురువారం దేశంలో 5,335 కేసులు నమోదు అయ్యాయి.

coronainindia

ఒక్క రోజులోనే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,47,39,769కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,320 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,41,85,858కి చేరింది. ఇక ప్రస్తుతం దేశంలో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ముంబాయిలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముంబాయిలో 216 కేసులు రిజిస్టర్ అయ్యాయి. థానే నగరంతో పాటుగా జల్నా జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు.రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220,66,20,700 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. దేశంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌లో మ్యుటేషన్లు జరుగుతున్న కొద్దీ ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కేంద్రం ఈ సమయంలో అలర్ట్ అయింది. కొత్త మార్గదర్శకాల జారీకి నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+