నెమ్మదిగా జూలు విదిలిస్తోన్న కరోనా?
ప్రజలను భయపెట్టిన కరోనా మరోసారి తన విశ్వరూపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి మోడీ దీనిపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
కరోనా నెమ్మదిగా జూలు విదిలిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. కరోనా పరిస్థితి, దాన్ని ఎదుర్కోవడానికి ప్రజా ఆరోగ్యశాఖ సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడంతోపాటు వైరస్‌ను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. గడిచిన 24గంటల వ్యవధిలో కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 1,134 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క్రియాశీలక కేసులు 7026కు చేరుకున్నాయి.
మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,03,831 శాంపిల్స్‌ను పరీక్షించి 1,134 కేసులను పాజిటివ్ గా నిర్థారించారు. ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్ తో మృతిచెందారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడిచినవారి సంఖ్య 5,30,813కి చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 95.05 కోట్ల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 4,46,98,118మందిలో వైరస్ ఉన్నట్టు తేలింది. మంగళవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 662మంది కోలుకున్నారు. దీంతో పాజిటివ్ వచ్చి కోలుకున్నవారి సంఖ్య 4,41,60,279కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.09%గా ఉంది. మరణాల రేటు 1.19శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65కోట్ల డోసుల కొవిడ్ టీకాను పంపిణీ చేశారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ అలజడి రేగుతోంది. ఇజ్రాయెల్ లో మరో కొత్త వేరియంట్ బయటపడింద. విదేశాలకు వెళ్లివచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఈ వేరియంట్ ను గుర్తించినట్లు ఇజ్రాయెల్ కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బీఏ1 (ఒమిక్రాన్), బీఏ2 వేరియంట్ల జన్యువుల కలయికతో ఇది వెలుగులోకి వచ్చింది. వారిద్దరు బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. వారికి PCR పరీక్ష చేసిన తర్వాత పాజిటివ్ గా తేలింది. వారి నమూనాలను సీక్వెన్సింగ్ కోసం పంపారు.












Click it and Unblock the Notifications