Shock: మీ శవం ఎక్కడో ఉందో మీరే తెచ్చుకోండి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది పరిస్థితి, షేమ్ షేమ్ !

చెన్నై: దేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో రోజూ కొన్ని వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కోవిడ్ రోగుల పట్ల, కరోనా వ్యాధితో మరణించిన వ్యక్తుల అంత్యక్రియలు చెయ్యడంలో ప్రభుత్వ సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఉత్తర భారతదేశంలో కోవిడ్ వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలను నదిలో విసిరేశారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కోవిడ్ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలు, అనారోగ్యంతో మరణించిన వారి మృతదేహాలను ఒకే రూమ్ లో మునిసిపాటీ చెత్తకుప్పలో చెత్త విసిరేసినట్లు విసిరేశారని వెలుగు చూడటం కలకం రేపింది. మార్చురీ రూమ్ లోకి బంధువులను పంపించిన సిబ్బంది మీ శవం ఎక్కడ ఉందో మీరే తెచ్చుకోండి అని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది పరిస్థితి అంటూ మృతుల బంధువులు మండిపడుతున్నారు.

 తేనీలో కలకలం

తేనీలో కలకలం

తమిళనాడులోని తేనీలో కోవిడ్ వ్యాధితో 47 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. అతని శవాన్ని తేనీ కే. విలక్కు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కోవిడ్ వ్యాధితో మరణంచిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకోవడానికి అతని బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. కోవిడ్ వ్యాధితో చనిపోయిన వ్యక్తి పేరు, వివరాలు తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అతని బంధువులను మార్చురీ దగ్గరకు పిలుచుకుని వెళ్లారు.

 శవం ఎక్కడ ఉందో వెతుక్కోండి

శవం ఎక్కడ ఉందో వెతుక్కోండి

మార్చురీ రూమ్ తాళం తీసిన సిబ్బంది మీ బంధువు శవం ఎక్కడ ఉందో మీరే వెతుక్కొండి అంటూ అతని బంధువులను లోపలికి పంపించారు. లోపలికి వెళ్లిన బంధువులు అక్కడ బ్లూకలర్ బ్యాగుల్లో శవాలను మూటకట్టి మునిసిపాలిటీ చెత్త కుప్పలో చెత్త విసిరేసినట్లు విసిరేసిన విషయం గుర్తించిన బంధువులు షాక్ అయ్యారు.

 ఒక్క రూమ్ లో 19 మృతదేహాలు ?

ఒక్క రూమ్ లో 19 మృతదేహాలు ?

ఒకే రూమ్ లో 19 మృతదేహాలు ఉడ్డగా పడిఉండటం చూసిన రోగి బంధువులు ఆసుపత్రి డీన్ బాలాజీనాథన్ ను నిలదీశారు. ఇక్కడ శవాలు పెట్టడానికి రెండు రూమ్ లే ఉన్నాయి. ఒక్క రూమ్ లో మూడు లేదా నాలుగు మృతదేహాలు పెట్టడానికి అవకాశం ఉంది, మిగిలిన మృతదేహాలు మేము ఎక్కడ పెట్టాలి మీరే చెప్పండి, ఓక్కోరోజు రాత్రి 10 కంటే ఎక్కువ మృతదేహాలు వస్తున్నాయని, వేరే రూమ్ లు లేకపోవడంతో అన్ని మృతదేహాలు రూమ్ లో వేశామని డీన్ బాలాజీనాథన్ చెప్పారని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 శవాలు వేరే చేశాము..... కానీ టైమ్ బాగాలేదు

శవాలు వేరే చేశాము..... కానీ టైమ్ బాగాలేదు

కోవిడ్ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలు వేరే రూమ్ లో, అనారోగ్యంతో మరణించిన వారి మృతదేహాలు వేరే రూమ్ లో పెట్టామని డీన్ బాలాజీ స్థానిక మీడియాకు చెప్పారు. ఉద్యోగుల నిర్లక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, మరో ఉద్యోగిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని డీన్ బాలాజీనాథన్ మీడియాకు చెప్పారు. ఇటీవల ఉత్దర భారతదేశంలో కోవిడ్ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలు నదిలో విసిరేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే అంతకంటే ఘోరంగా తేనీలో ఒకే రూమ్ లో కుప్పలు కుప్పలుగా శవాలు వెయ్యడం ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగుల తీరుపై తీవ్ర విమర్శలకు తెరలేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+