కరోనా: ఐసీఎంఆర్ ట్విటర్ నిలిపివేత - హ్యాండిల్ నుంచి మోదీ వ్యతిరేక పోస్టులు..
కరోనా విపత్తు సమయంలో కీలకంగా వ్యవహరిస్తోన్న దేశ అత్యున్నత ఆరోగ్య పరిశోధన సంస్థ 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)' ట్విటర్ సేవలు బుధవారం రాత్రి అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఐసీఎంఆర్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు వెళుతున్నట్లు గుర్తించడమే ఇందుకు కారణమని వెల్లడైంది.
''సంస్థ ట్విటర్ ఖాతాలో ఇబ్బందులు తలెత్తాయి. మా హ్యాండిల్ నుంచి ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు వస్తున్నట్లు పలువురు చెప్పడంతో సేవల్ని నిలిపేశాం. లోపాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యలు చేపట్టాం. ఈ కారణంగా ప్రజలు ఏదైనా అసౌకర్యానికి లోనయితే క్షమాపణలు కోరుతున్నాం'' అని ఐసీఎంఆర్ ప్రకటన చేసింది.

అతకు ముందు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మీడియాతో మాట్లాడుతూ దేశంలో కరోనా పరిస్థితులపై కీలక కామెంట్లు చేశారు. మరణాల రేటు తక్కువే అయినప్పటికీ, కొత్త కేసులు భారీగా వస్తుండటానికి కారణం కొందరి బాధ్యతా రహిత్య వైఖరేనని ఆయన అన్నారు. ''బాధ్యతా రహితమైన వ్యక్తులు, మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూరాన్ని పాటించని కారణంగానే దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది''అని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ రెండవ జాతీయ సెరో సర్వే బుధవారం ప్రారంభిమైందని, ఇది సెప్టెంబర్ మొదటి వారానికి పూర్తవుతుందని భార్గవ తెలిపారు.
మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య పరంగా అమెరికా(5.6లక్షలు), బ్రెజిల్(3.68లక్షలు) తర్వాతి స్థానంలో భారత్(3.3లక్షలు) ఉంది. అయితే, ప్రతిరోజూ కొత్తగా నమోదవుతోన్న కేసుల విషయంలో మాత్రం మనం టాప్ లో ఉండటం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 67,151 కేసులు నమోదయ్యాయి. అదే అమెరికాలో ఆ సంఖ్య 15,456గాను, బ్రెజిల్ లో 9వేలుగానూ ఉంది.












Click it and Unblock the Notifications