భారత్‌లో కరోనా: భారీగా మరణాలు -నిన్ని 4,157 మంది బలి, తగ్గిన వైరస్ వ్యాప్తి, కొత్తగా 2.08లక్షల కేసులు

దేశంలో కరోనా రెండో దశ విలయంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తూ, రోజువారీ కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నా, కొవిడ్ మరణాలు మాత్రం ఇంతితై అన్నట్లు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా 13వ రోజూ కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా వచ్చాయి. వ్యాక్సిన్ల కొరత కారణంగా టీకాల ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. వివరాలివి..

కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదలచేసిన బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22 లక్షల శాంపిళ్లను పరీక్షించారు. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం తొలిసారి కావడం గమనార్హం. ఆ టెస్టుల్లో కొత్తగా 2,08,921 మంది పాజిటివ్ గా తేలారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగింది.

covid-19 in india: 2.08 lakh new cases, 4,157 deaths in last 24 hrs, active caseload at 24.95 lakh

దేశంలో నిన్న ఒక్కరోజే కరోనా కాటుకు 4,157 మంది బలయ్యారు. గడిచిన కొద్ది రోజులుగా రోజువారీ కొత్త కేసులు తగ్గుతూవస్తున్నా మరణాలు మాత్రం 4వేలకుపైగానే కొనసాగుతుండటం ఆందోళనలు రేకెత్తిస్తున్నది. తాజా మరణాలతో కలిపి ఇప్పటిదాకా 3,11,388 మంది కొవిడ్ వల్ల ప్రాణాలు వదిలారు.

నిన్న ఒక్కరోజే కొవిడ్ వ్యాధి నుంచి 2,95,955 మంది కోలుకున్నారు. తద్వరా రికవరీల సంఖ్య 2,43,50,816కు పెరిగింది. దేశంలో రికవరీ రేటు 89.26 శాతానికి చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 24,95,591గా ఉంది. పాజిటివిటీ రేటు 9.60 శాతానికి చేరింది. ఇదిలా ఉంటే,

దేశంలో టీకాల కొరత ఇంకా కొనసాగుతున్నది. సరిపడా వ్యాక్సిన్లు లేని కారణంగా చాలా రాష్ట్రాల్లో 18-44 గ్రూపువారికి వ్యాక్సినేషన్ వాయిదాపడగా, ఉన్న టీకాలను రెండో డోసు వారికి అందజేస్తున్నారు. ఇప్పటివరకు 20,06,62,456 టీకా డోసులను పంపిణీ అయ్యాయయని, నిన్న ఒక్కరోజే 20,39,087 మంది టీకా వేయించుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+