దేశంలో తొలిసారి యాక్టివ్ కేసులను మించిన రికవరీస్! ఎంతంటే?

న్యూఢిల్లీ: భారతదేశంలో రోజు రోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం ఊరటనిచ్చే అంశంగా మారింది. .

దేశంలో తొలిసారి..

దేశంలో తొలిసారి..


అయితే, తొలిసారి దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల నమోదు కన్నా.. కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. బుధవారం ఒక్కరోజే పెరిగిన పాజిటివ్ కేసులకు అదనంగా 1573 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో దేశంలో 9985 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 279 మరణాలు సంభవించాయి.

వైద్యారోగ్య శాఖ ఏమందంటే..?

వైద్యారోగ్య శాఖ ఏమందంటే..?

ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,33,632 ఉండగా, 1,35,205 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఉదయం వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 2,76,583 ఉండగా, ఇప్పటి వరకు 7745 కరోనా మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదు కావడంతో ఇదే తొలిసారని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో సుమారు 10వేల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 279 మరణాలు చోటు చేసుకున్నాయి. కరోనా సోకినవారిలో 48.99 శాతం మంది కోలుకున్నారని వైద్యశాఖ వెల్లడించింది.

Recommended Video

    Vijayawada Lockdown Again As Raise In Corona Cases
    పాజిటివ్ కేసులతోపాటు పెరుగుతున్న రికవరీ..

    పాజిటివ్ కేసులతోపాటు పెరుగుతున్న రికవరీ..


    బుధవారం సాయంత్రానికి దేశంలో కరోనా కేసులను గమనించినట్లయితే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,514 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1,34,480. 1,35,264 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 7755 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. ఒక్క మహారాష్ట్రలోనే 90,787 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత తమిళనాడులో 34,914, ఢిల్లీలో 31,309, గుజరాత్ రాష్ట్రంలో 21,044 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+