వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

new study: తక్కువ మాట్లాడండి.. కరోనాను కట్టడి చేయండి!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనావైరస్. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అయితే, ఇప్పటి వరకు పూర్తిస్థాయి వ్యాక్సిన్ మాత్రం మార్కెట్లోకి రాలేదు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 విషాదం: కరోనా మందంటూ తండ్రికి విషం తాగించి యువకుడు ఆత్మహత్య విషాదం: కరోనా మందంటూ తండ్రికి విషం తాగించి యువకుడు ఆత్మహత్య

తక్కువగా మాట్లాడండి..

తక్కువగా మాట్లాడండి..

అయితే, అప్పటి వరకు కరోనాను నియంత్రించేందుకు అనేక మార్గాలను సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం లాంటివి ఇప్పటికే ప్రజలు అలవాటు చేసుకుంటున్నారు. తాజాగా మరో అధ్యయనం తక్కువ మాట్లాడటం, మృధువుగా భాషించడం ద్వారా కూడా కరోనా ప్రభావాన్ని తగ్గించవచ్చని తేల్చింది.

కరోనా కట్టడి..

కరోనా కట్టడి..


ఆస్పత్రులు, రెస్టారెంట్ల లాంటి తక్కువ ధ్వని కలిగిన ఇండోర్ ప్రదేశాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉంటుందని, తక్కువ ధ్వనితో మాట్లాడటం కూడా కరోనా నియంత్రణకు దోహదం చేస్తోందని అధ్యయనం వెల్లడించింది. సగటున 6 డిసిబెల్స్‌తో మాట్లాడటం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని స్టడీ తేల్చింది. గది వెంటిలేషన్ రెండింతలు చేసినంతగా ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది.

తక్కువ ధ్వని ప్రదేశాల్లో..

తక్కువ ధ్వని ప్రదేశాల్లో..

తక్కువ ధ్వని కలిగిన ప్రదేశాల్లో కరోనా వ్యాప్తి కూడా తక్కువగా ఉందని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు తేల్చారు. డావిస్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రీసెర్చర్స్ ఈ మేరకు పరిశోధనలు జరిపారు. రెస్టారెంట్స్, ఫిట్నెస్ సెంటర్లలో ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను విడుదల చేసింది. తక్కువగా మాట్లాడుతూ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని సూచించింది.

ఈ ప్రాంతాల్లో కరోనా ప్రమాదం తక్కువ

ఈ ప్రాంతాల్లో కరోనా ప్రమాదం తక్కువ


సాధారణ సంభాషణ 10 డిసిబెల్స్ ఉంటుందని.. రెస్టారెంట్లలో సుమారు 70 శాతం ఉంటుంది. అన్ని ఇండోర్ ఎన్విరాన్‌మెంట్లలో సమానమైన రిస్కు ఉండదని లీడ్ రీసెర్చర్ విలియమ్ రిస్టన్‌పార్ట్ తెలిపారు. ఎక్కువ మంది ఉన్నప్పటికీ తక్కువ ధ్వని ఉంటే.. ప్రమాదం తక్కువగానే ఉంటుందని తెలిపారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కోటికి చేరువలో ఉండటం గమనార్హం. రోజుకు ఈ మహమ్మారి బారినపడి సుమారు 5వేల మందికిపైగా మరణిస్తున్నారు.

English summary
More quiet zones in high-risk indoor spaces, such as hospitals and restaurants, could help to cut coronavirus contagion risks, researchers have said, after a study showed that lowering speaking volume can reduce the spread of the disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X