'కట్టలాన్' మూవీ రివ్యూ.. మాస్ యాక్షన్‌తో అదరగొట్టారుగా..?

మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'కట్టలాన్' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆంటోనీ వర్గీస్ పెప్పె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. 'మలయాళంలో అత్యంత హింసాత్మక చిత్రం' అనే ప్రచారంతో విడుదలైన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్సూరు సంగీతం అందించగా, క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది.

భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టైలిష్ విజువల్స్, పగ-ప్రతీకారం నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ చిత్రం యాక్షన్, క్రైమ్, గ్యాంగ్‌స్టర్ డ్రామా జానర్‌లో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తుంది. సునీల్, కబీర్ దుహాన్ సింగ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించగా, దుషారా విజయన్ కథలో కీలక మలుపు తీసుకొచ్చే పాత్రలో కనిపిస్తుంది. మాస్ యాక్షన్, ఇంటెన్స్ ఫైట్లు, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మెప్పించిందా ? లేదా ?? అనేది తెలుసుకుందాం..

kattalan-movie-review-in-telugu-starring-antony-varghese-dushara-vijayan-under-paul-george-directio

కథ ఏంటంటే?

దట్టమైన అడవులు, ఏనుగు దంతాల అక్రమ రవాణా, అధికారం కోసం రక్తపాతం.. ఈ మూడు అంశాల చుట్టూనే 'కట్టలాన్' కథ తిరుగుతుంది. 'ఆనకొల్లి' అనే ఊహాజనిత గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని ఈ కథ సాగుతుంది. అక్కడ ఏనుగులను వేటాడి వాటి దంతాలను స్మగ్లింగ్ చేస్తూ మారి (సునీల్) తన గ్యాంగ్‌తో ఓ సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. అయితే ఆ సామ్రాజ్యంపై ఎడ్డీ (కబీర్ దుహాన్ సింగ్) కన్నేస్తాడు. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సమయంలో ఆంటోనీ (ఆంటోనీ వర్గీస్ పెప్పె) అనూహ్యంగా ఆ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అక్కడి నుంచి పరిస్థితులు మారిపోతాయి. ఒక సాధారణ వ్యక్తిగా కనిపించే ఆంటోనీ ఎలా అడవి సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాడు? మారి, ఎడ్డీల మధ్య పోరులో ఎవరు గెలిచారు? దంతాల స్మగ్లింగ్ వెనుక దాగిన రహస్యాలేమిటి? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే?

'మలయాళంలో అత్యంత హింసాత్మక చిత్రం' అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన 'కట్టలాన్' మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా 'మార్కో' తర్వాత అదే నిర్మాణ సంస్థ నుంచి రావడం, రవి బస్సూరు సంగీతం అందించడం సినిమాపై అంచనాలను పెంచింది. దర్శకుడు పాల్ జార్జ్ ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తిగా మాస్ యాక్షన్ జానర్‌ను ఎంచుకున్నాడు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, దానిని చెప్పిన విధానం, యాక్షన్ సన్నివేశాల ట్రీట్‌మెంట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. అడవి నేపథ్యంలో నడిచే గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని సహజత్వానికి దగ్గరగా చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. మొదటి భాగంలో పాత్రల పరిచయం, గ్యాంగ్‌ల మధ్య పోరు, దంతాల స్మగ్లింగ్ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తారు. రెండో భాగంలో కథ మరింత హింసాత్మకంగా మారుతుంది. ఎమోషన్స్ కంటే యాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

ఎవరెలా చేశారంటే..

  • ఆంటోనీ వర్గీస్ పెప్పె తనకు బాగా అలవాటైన రగ్గడ్ మాస్ పాత్రలో మరోసారి మెప్పించాడు. ఫైట్లు, ఎలివేషన్ సీన్స్, డైలాగ్ డెలివరీలో తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా సాధారణ కార్మికుడి నుంచి భయంకరమైన నాయకుడిగా ఎదిగే పాత్రను సమర్థవంతంగా మోశాడు.
  • సునీల్‌కు చాలా కాలం తర్వాత ఓ పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్ క్యారెక్టర్ దక్కింది. మారి పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.
  • కబీర్ దుహాన్ సింగ్ కూడా తన పాత్రకు తగ్గట్టుగా కనిపించాడు.
  • దుషారా విజయన్ పాత్ర రెండో భాగంలో వస్తుంది. స్క్రీన్ టైమ్ తక్కువైనా కథలో కీలకమైన మలుపులకు కారణమవుతుంది.
  • సిద్ధిఖ్, హిప్‌స్టర్, ఆన్సన్ పాల్, హనాన్ షా తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం పనితీరు..

  • సినిమాకు అతిపెద్ద బలం యాక్షన్ సన్నివేశాలు. యాక్షన్ కొరియోగ్రాఫర్లు సంతోష్-కెచ్చా ఖంఫాక్డీ రూపొందించిన ఫైట్ సీక్వెన్స్‌లు థియేటర్లలో మంచి అనుభూతిని ఇస్తాయి. అడవిలో జరిగే ఛేజ్‌లు, గ్యాంగ్ వార్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ మాస్ ప్రేక్షకులకు నచ్చుతాయి.
  • కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరీ ఎక్కువ హింసతో ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాస్త అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. అయితే యాక్షన్ ప్రేమికులకు మాత్రం ఇది పూర్తి స్థాయి విందులా ఉంటుంది.
  • 'KGF', 'సలార్', 'మార్కో' వంటి చిత్రాల్లో తన సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవి బస్సూరు మరోసారి తన మేజిక్ చూపించాడు. ప్రతి పాత్రకు ప్రత్యేక థీమ్ ఇవ్వడం, యాక్షన్ సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఉత్కంఠ పెంచడం సినిమాకు ప్రధాన బలంగా మారింది.
  • రణదివె, చంద్రు సెల్వరాజ్, సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అడవి అందాలు, చీకటి వాతావరణం, రక్తపాత సన్నివేశాలను విజువల్‌గా బలంగా చూపించారు.
  • షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ చాలా చోట్ల షార్ప్‌గా ఉన్నప్పటికీ, రెండో భాగంలో కొన్ని సన్నివేశాలను కాస్త ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలు మాత్రం హాలీవుడ్ స్థాయిలో కనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్..

  • ఆంటోనీ వర్గీస్ పెప్పె నటన
  • రవి బస్సూరు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
  • స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు
  • అడవి నేపథ్యంలో విజువల్ ట్రీట్
  • సునీల్ నెగటివ్ పాత్ర

మైనస్ పాయింట్స్..

  • కథలో కొత్తదనం తక్కువ
  • అధిక హింస
  • కొన్ని చోట్ల నెమ్మదిగా సాగే కథనం
  • ఎమోషనల్ కనెక్ట్ పరిమితంగా ఉండటం

రేటింగ్: 3.25/5

మాస్ యాక్షన్ అభిమానులు తప్పక చూడాల్సిన చిత్రాల్లో 'కట్టలాన్' ఒకటి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+