రాహుల్ కు సిద్దరామయ్య డిమాండ్ల చిట్టా..! ఇవన్నీ నెరవేర్చాల్సిందే..!

అనూహ్య పరిణామాల మధ్య కర్నాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య (Siddaramaiah).. ఇవాళ అగ్రనేత రాహుల్ గాంధీని, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ఢిల్లీలో కలిశారు. కర్నాటకలో సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఆయన సమర్పించిన లేఖను ఇవాళ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదించారు. అదే సమయంలో సిద్దరామయ్య రాహుల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం పదవి వదులుకున్నందుకు ప్రతిగా తన డిమాండ్లను రాహుల్ ముందుంచారు.

ఇందులో కర్నాటకలో కొత్తగా ఏర్పడే డీకే శివకుమార్ నేతృత్వంలోని కేబినెట్లో తన కుమారుడు యతీంద్రకు కీలకమైన పోర్ట్‌ఫోలియోలు కేటాయించడంతో సహా పలు డిమాండ్లు ఉన్నాయి. సిద్ధరామయ్య రాజ్యసభ, ఎమ్మెల్సీ నియామకాల కోసం పేర్ల జాబితాలతో పాటు, మంత్రివర్గ పదవులపై తన ప్రాధాన్యతలను కూడా అందజేసినట్లు సమాచారం. తన కుమారుడు యతీంద్రకు వైద్య, విద్య, వెనుకబడిన తరగతుల శాఖలతో పాటు, ప్రత్యామ్నాయంగా శివకుమార్ నిర్వహించిన పరిశ్రమలు లేదా జలవనరుల శాఖ వంటి కీలకమైన పోర్ట్‌ఫోలియోలను కూడా ఇవ్వాలని సిద్దరామయ్య పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

Siddaramaiah Resigns as Karnataka CM Submits Wishlist to Rahul Gandhi What He Wants

మరోవైపు డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగించిన దుమారం సద్దుమణిగాక, సిద్ధరామయ్య హైకమాండ్ అందించిన రాజ్యసభ సీటును తిరస్కరించి, కర్ణాటక రాజకీయాల్లోనే పాతుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే రాజ్యసభకు పోటీ చేసేందుకు తాను సిద్దంగా లేనట్లు అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి సిద్దరామయ్య డిమాండ్లను నెరవేర్చినా ఆయన పూర్తిగా సద్దుమణుగుతారన్న గ్యారంటీ లేదు కాబట్టి ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పలు ప్రతిపాదనలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+