వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూళ్ల రీఓపెనింగ్ ఇప్పుడే కాదు - సెప్టెంబర్ 1ని ఖరారు చేయలేదన్న కేంద్రం - తలో దారిలో రాష్ట్రాలు..

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు, 848 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 31.72లక్షలకు, మరణాల సంఖ్య 58,562కు పెరిగింది. రికవరీలు, మరణాల సంఖ్య పరంగా భారత్ మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. స్కూళ్లు, కాలేజీలను మాత్రం ఇప్పుడప్పుడే తెరవబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Recommended Video

Reopening of Schools and Colleges ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచనే లేదు !

ఎస్పీ బాలు చేతి వేళ్లతో సైగలు - నిజంగా శుభదినమంటూ ఎస్పీ చరణ్ ఉద్వేగం - ఇంకా వెంటిలేటర్ పైనే..ఎస్పీ బాలు చేతి వేళ్లతో సైగలు - నిజంగా శుభదినమంటూ ఎస్పీ చరణ్ ఉద్వేగం - ఇంకా వెంటిలేటర్ పైనే..

కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం అన్ లాక్ ప్రక్రియ చేపట్టడం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్ 4.0 ప్రారంభం కానుండగా, అందులో విద్యా సంస్థలకు కూడా మినహాయింపులు ఇస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని, ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచనేదీ లేదని, దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖకు తాము ఎలాంటి ప్రతిపాదనా పంపలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కుండబద్దలు కొట్టారు.

 covid-19: Reopening Of Schools And Colleges Unlikely After September 1: health ministry

కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ స్కూళ్ల రీఓపెనింగ్ అంశంపై క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కాబోయే అన్ లాక్ 4.0పై కేంద్ర హోం శాఖ త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తుందని, అందులో విద్యా సంస్థల అంశం ఉడబోదని ఆయన చెప్పారు. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలను కేంద్రం తొలగించిన దరిమిలా అన్ లాక్ 4.0లో మెట్రో సర్వీసులు, సినిమా హాళ్లు, బార్లకు మినహాయింపు లభించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే..

షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై ఘాతుకం - సెటిల్మెంట్ - కులం తక్కువని రివర్స్షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై ఘాతుకం - సెటిల్మెంట్ - కులం తక్కువని రివర్స్

స్కూళ్ల రీఓపెనింగ్ విషయంలో కేంద్రం సూచనల్ని అనుసరిస్తున్నామంటూనే వివిధ రాష్ట్రాలు తలో దారిలో పయనిస్తున్నాయి. తెలంగాణలో 2020-21 విద్యా సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుందని, ఆ రోజు నుంచే టీశాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని, త‌ర‌గ‌తుల ప్రారంభానికి ముందే ఈ నెల 27 నుంచి టీచర్లు స్కూళ్లకు భౌతికంగా హాజరుకావాల్సి ఉంటుందని కేసీఆర్ సర్కార్ ఆదేశించింది. అటు ఏపీలోనూ సెప్టెంబర్ 5 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏపీలోనూ ప్రస్తుతానికి ఆన్ లైన్ ద్వారానే పాఠాలు చెప్పనున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా వివిధ తేదీల్లో తమ విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

English summary
Union health ministry said the home ministry has not formulated any guidelines with respect to reopening of schools. Reports had earlier indicated that the government will release Unlock 4.0 guidelines shortly, and that the Delhi Metro is likely to resume services from September 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X