మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా - అమిత్ షా చేరిన కార్పొరేట్ ఆస్పత్రిలోనే..
కేంద్ర కేబినెట్ పై కరోనా ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా ఇన్ఫెక్షన్ కు గురికాగా, న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్, పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో తదితరులు ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. తాజాగా పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
తాను కరోనా బారినపడ్డ విషయాన్ని మంత్రి ప్రధాన్ మంగళవారం సాయంత్రం స్వయంగా వెల్లడించారు. 'కరోనా లక్షణాలుగా అనుమానించి పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సలహా మేరకు హాస్పిటల్‌లో చేరాను. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది'' అని ట్వీట్ చేశారు.

అమిత్ షా చికిత్స పొందుతోన్న గురుగ్రామ్ లోని 'మేదాంత ఆస్పత్రి'లోనే ధర్మేంద్ర ప్రధాన్ కూడా చేరారు. కరోనాకు గురైన కేంద్ర మంత్రులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతుండటంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ''హోం మంత్రికి ఆరోగ్యం బాగాలేప్పుడు ఢిల్లీ ఎయిమ్స్‌కు కాకుండా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లడం వెళ్లడం నన్ను ఆశ్చార్యానికి గురిచేసింది. ఇలాచేస్తే ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు విశ్వాసం ఎలా పెరుగుతుంది?''అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,050 కొత్త కేసులు, 803 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18.78లక్షలకు, మరణాల సంఖ్య 39వేలకు పెరిగింది. ఇప్పటిదాకా 12.5లక్షల మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 5.89లక్షలుగా ఉంది. సోమవారం నాటికి 2.08కోట్ల శాంపిల్స్ ను టెస్టు చేసినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications