వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చేనెల నుంచి చిన్నారులకు వ్యాక్సిన్: కేంద్రం

|
Google Oneindia TeluguNews

కరోనాకు టీకానే విరుగుడు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని.. అవసరమైతే బూస్టర్ డోసు కూడా వేయించుకోవాలని చెబుతున్నారు. 18 ఏళ్ల నుంచి ఆపై వయసువారు టీకా తీసుకుంటున్నారు. చిన్న పిల్లలకు వచ్చేసరికి క్లారిటీ లేకుండా పోయింది. దీనికి సంబంధించి పరిశోధనలు చేస్తున్నారు. వచ్చేనెల నుంచి చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయిస్తామని కేంద్రం స్పష్టంచేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవియా తెలిపారు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాని మోడీ కూడా పాల్గొనగా.. పై కామెంట్స్ మాండవియా చేశారు. చిన్నపిల్లలకు భారత్ బయోటెక్ కోవాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా వివరించారు. 2-6 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ సెప్టెంబర్‌లో అందుబాటులోకి వస్తుందని గులేరియా ఇదివరకే ప్రకటించారు.

Covid-19 vaccine for children likely next month: Health Minister

2 నుంచి 17 ఏళ్ల వారికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని రణదీప్ గులేరియా తెలిపారు. పరీక్షలకు సంబంధించి డీసీజీఐ అనుమతి ఇచ్చిందని వివరించారు. 175 మందితో పరిశోధన కూడా చేస్తున్నారు. జైడస్ క్యాడిల్లా వ్యాక్సిన్ కూడా చిన్న పిల్లలకు పరిశోధన చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కరోనా థర్డ్ వేవ్ మాత్రం భయాందోళన కలిగిస్తోంది.

English summary
Union Health Minister Mansukh Mandaviya on Tuesday said the Covid-19 vaccine for children is expected to be launched in the country from August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X