• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్: ‘మే రెండో వారం తరువాత భారత్‌లో రోజుకు 8 నుంచి 9 లక్షల కేసులు నమోదవుతాయి’

By BBC News తెలుగు
|

కరోనా వైరస్

కరోనా వైరస్ విషయంలో సరైన చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు దారుణంగా మారే ప్రమాదం ఉందని అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీలో ఎపిడిమియాలజిస్ట్‌గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన డాక్టర్ భ్రమర్ ముఖర్జీ హెచ్చరించారు.

డేటా ఆధారంగా అంటువ్యాధులను అంచనా వేయడంలో డాక్టర్ ముఖర్జీ నిపుణురాలు. గణాంకాల ద్వారా అంటువ్యాధి తీరు తెన్నులను కచ్చితంగా, శాస్త్రీయంగా అంచనా వేయవచ్చని భ్రమర్ ముఖర్జీ అంటారు.

గత ఏడాది మార్చి నుంచి భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఆమె అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ఆధారంగా భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని ఆమె ముందే ఊహించారు.

సెకండ్ వేవ్‌లో మే రెండో వారం నుంచి రోజుకు 8 నుంచి 9 లక్షల కేసులు నమోదవుతాయని, రోజుకు నాలుగున్నర వేలమంది మరణించే ప్రమాదం ఉందని ఆమె ఇటీవల చెప్పారు.

బీబీసీ కరస్పాండెంట్ జుబేర్ అహ్మద్‌తో జూమ్ ద్వారా మాట్లాడిన ఆమె భారతదేశంలో కరోనా స్థితిగతులపై పలు అంశాలు వెల్లడించారు.

కరోనా వైరస్

జుబేర్ అహ్మద్: భవిష్యత్తులో రాబోయే కరోనా వేవ్‌లను ఎదుర్కోవడానికి భారత దేశం ఎంత వరకు సిద్ధంగా ఉందని మీరు భావిస్తున్నారు ?

భ్రమర్ ముఖర్జీ: నిపుణులు డేటా ఆధారంగా అంటువ్యాధి గురించి ఒక అంచనా వేయగలరు. హెచ్చరించగలరు. వాటిని అర్ధం చేసుకుంటే ఈ ప్రమాదాలు రావు. దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సింది విధాన నిర్ణేతలు, ప్రజలు మాత్రమే.

ఈ అంచనాల ద్వారా ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం, సభలు, సమావేశాలను నిరోధించడం, ప్రాంతీయ లాక్‌డౌన్‌లాంటి వాటికి ప్రాధాన్యతనివ్వాలి.

నా ఆశ, కోరిక ఏంటంటే, ఈ అంచనాలన్నీ నిజం కాకూడదని. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవన్నీ నిజమై కూర్చుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మే మొదటి వారం తర్వాత పీక్‌ దశ ఉంటుందని నేనే కాదు, చాలామంది ఊహిస్తున్నారు.

ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. అలాగే మరణాలు కూడా పెరుగుతాయి. దేశంలో గణాంకాలు సేకరించే పని సరిగా జరగడం లేదు. దాని వల్ల కూడా వైరస్ బాగా వ్యాపిస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం అనారోగ్యంతో, కోవిడ్ లక్షణాలు ఉన్న వారి సంఖ్య విస్తుగొలిపేలా ఉంది.

కరోనా వైరస్

ప్రశ్న: కొంతమంది మీరు అంచనా వేసే పద్ధతిని తప్పుబడుతున్నారు కదా ?

జవాబు: సైన్సును, శాస్త్రవేత్తలను అనుమానంగా చూసేవారు, అసంతృప్తి వ్యక్తం చేసేవారు ఎప్పుడూ ఉంటారు. మేం గత 380 రోజులుగా ఈ మహమ్మారిని పరిశీలిస్తూ వస్తున్నాం.

ఎక్కడా మా అంచనాలు తప్పుకాలేదు. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఉంటుందని ముందే చెప్పాం. ఒక ప్రజారోగ్య నిపుణుల అంచనాలను, గణాంకాలను ప్రజలకు చేరవేయాల్సి ఉంది.

ప్ర: మరో వేవ్‌ను ఎదుర్కోవడానికి ఇండియా సిద్ధంగా ఉందా ?

: నాకు తెలిసి లేదు. ఇండియా రాబోయే వేవ్‌ను ఎలా ఎదుర్కోవాలో నేను ఓ వ్యాసంలో రాశాను. మనం ఒక అంటువ్యాధిని జాగ్రత్తగా పరిశీలిస్తూ వస్తే, దాని ట్రెండ్ అర్ధమైపోతుంది. ఇప్పుడు మనం ఉన్నది చివరి వేవ్ కాదన్నది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి.

ఈ కరోనా మహమ్మారి తీవ్రతను ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలి. అప్పుడే దాని ప్రభావం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోగలం. తీరా దగ్గరికి వచ్చాక తెలుసుకోవాలని ప్రయత్నించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజారోగ్య వ్యవస్థను విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

డేటాను కూడా ఎక్కువగా సేకరించాలి. అప్పుడే మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడగలం. ఫీల్డులో ఉండి డేటా సేకరిస్తున్న వారి గణాంకాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాలా ముఖ్యం.

కరోనా వైరస్

ప్ర: డేటా సేకరణలో ఇండియా వెనకబడి ఉందని మీరు భావిస్తున్నారా ?

: కచ్చితంగా. భారతదేశంలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో డేటా సేకరించడం చాలా కష్టం.

ఎఫెక్ట్ అయినవారిలో మగవాళ్లు ఎందరు, ఆడవాళ్లు ఎందరు, ఏ వేవ్ లో వారు వైరస్ బారిన పడ్డారు అన్న సమాచారం లేదు.

ప్ర: ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మీకు ఏ విధంగా ఉపయోగపడింది?

: తక్కువ డేటాతో వీలయినంత ఎక్కువ సమాచారాన్ని ఎలా విశ్లేషించవచ్చో భారత్ మోడలింగ్ ప్రాజెక్టు మనకు నేర్పుతుంది. మా గణాంకాల్లో లెక్కకు రాని పాజిటివ్ కేసుల గురించి ప్రస్తావించ లేదు. ఇక టెస్టింగ్ స్థాయిలోనే మేం మా అంచనాలను సిద్ధం చేశాం. అందులో రిపోర్ట్ అయిన కేసులు, మరణాలు ఉంటాయి.

మేం ఈ మహా విపత్తులోని చాలా చిన్న భాగాన్ని మాత్రమే చూసి, ఇది ఎంత పెద్దదో అంచనాకు రాగలిగాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid: ‘After the second week of May, 8 to 9 lakh cases are reported daily in India’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X