చైనా నుంచి కోవిడ్ సామాగ్రి దిగుమతులు- రాష్ట్రాల ఒత్తిడితో కేంద్రం గ్రీన్‌సిగ్నల్
భారత్-చైనా మధ్య ఘర్షణల నేపథ్యంలో పొరుగుదేశం నుంచి దిగుమతుల విషయంలో కేంద్రం గతంలో ఆంక్షలు విధించింది. చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తుల విషయంలో గడువు తేదీలు ముగిసినా పొడిగింపు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చైనా వ్యాక్సిన్లతో పాటు ఇతర కోవిడ్ ఉత్పత్తుల విషయంలో గతంలో ముగిసిన గడువును తిరిగి పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్లు, ఇతర కోవిడ్ ఉత్పత్తుల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని కేంద్రంతో పాటు రాష్టాలు కూడా భావిస్తున్నాయి. అదే సమయంలో ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు, ఇతర కోవిడ్ సామాగ్రి చౌకగా ఉంటున్నాయి. దీంతో చైనా నుంచి దిగుమతులకు గడువు పొడిగిస్తున్నట్లు ఆర్ధికమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే గతంలో ఉన్న రూ.200 కోట్లకు మించిన దిగుమతుల నిబంధన కూడా తొలగించారు.

Recommended Video
గతేడాది ఏప్రిల్‌లో లడఖ్ సరిహద్దుల్లో తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నా ఇరుదేశాలూ కోవిడ్ వ్యాక్సిన్లు మినహా ఇతరత్రా సాయం అందించుకున్నాయి. ఇప్పుడు కోవిడ్ రెండో దశ నేపథ్యంలో అమెరికా నుంచి భారత్‌కు సాయం పెరగడాన్నీ చైనా ప్రభుత్వంతో పాటు మీడియా కూడా నిశితంగా గమనిస్తున్నాయి. అదే సమయంలో భారత్ వ్యాక్సిన్లను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్లోబల్ టెండర్లలో చైనా సంస్ధలు పాల్గొనే అవకాశం దక్కింది.












Click it and Unblock the Notifications