covid vaccine near me: గూగుల్ సెర్చ్, మ్యాప్స్ ద్వారా అపాయింట్‌మెంట్ పొందడిలా
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు సార్లు 24 గంటల్లోనే కోటికపైగా వ్యాక్సిన్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కరోనావైరస్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. వ్యాక్సినేషన్ వేగవంతం చేసే చర్యలను చేపడుతోంది.
ఇప్పటికే వాట్సాప్‌లోనూ టీకా స్లాట్‌ను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించిన కేంద్రం.. తాజాగా గూగుల్ సెర్చ్‌తోనూ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునేలో వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా బుధవారం వెల్లడించారు.

కోవిడ్ వ్యాక్సిన్లు సులభంగా లభించేందుకు మరో ముఖ్యమైన సదుపాయం తీసుకొచ్చాం. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో covid vaccine near me' సెర్చ్ చేయండి. టీకా స్లాట్ల లభ్యత, ఇతర వివరాలు తెలుసుకోండి. అక్కడే ఉన్న 'Book Appointment'అనే ఫీచర్‌ను ఉపయోగించి స్లాట్ బుక్ చేసుకోండి అని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
కాగా, గూగుల్ కూడా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింి. సెర్చ్, మ్యాప్, అసిస్టెంట్ ద్వారా.. దేశ వ్యాప్తంగా 13 వేలకుపైగా ప్రాంతాల్లో టీకా లభ్యత, అపాయింట్‌మెంట్ వివరాలను వినియోగదారులు గూగుల్ నుంచి తెలుసుకోవచ్చని వెల్లడించింది. కోవిడ్ నుంచి తీసుకున్న రియల్ టైం డేటా సహకారంతో ఈ సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపింది.
ప్రతి వ్యాక్సిన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న స్లాట్లు, టీకాలు, డోసులు ఉచితంగానే అందిస్తున్నారా.. లేదా వంటి వివరాలను గూగుల్ సెర్చ్‌లో తెలుసుకోవచ్చని తెలిపింది. అంతేగాక, ఈ సదుపాయం ఇంగ్లీష్ లోనే గాక, తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ ఇలా మొత్తం 8 ప్రాంతీయ భాషల్లో కూడా సమాచారం అందిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.
The @MoHFW_INDIA has taken yet another significant initiative to enhance access to #COVID19 vaccine:
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 1, 2021
🔎 Search 'covid vaccine near me' on Google
✅ Check availability of slots & more
💉 Use 'Book Appointment' feature to book a slot
📖 More details: https://t.co/zsI9A5fkCp
కాగా, భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 41,965 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. కారణంగా గత 24 గంటల్లో 460 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 30,203 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కేసులలో సగానికిపైగా కరోనా కేసులు ఒక కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్న తీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.
తాజా కేసులతో కలిపి భారత దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినుండి 3.19 కోట్ల మంది బయట పడ్డారు. గత 24 గంటల్లో 33,964 మంది కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది. నిన్న నమోదైన మరణాలతో కలిపి ఇప్పటి వరకు దేశంలో 4,39,020 మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి మరణాలలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 115 మరణాలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కొత్త కేసులు పెరుగుతున్న కారణంగా క్రియాశీల కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,78,181 క్రియాశీల కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల రేటు 1.15 శాతంగా ఉంది. దేశంలో సెప్టెంబరు అక్టోబరు నెలలో కరోనా మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందని ఐసీఎమ్ఆర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ -19 టీకా వేగం పుంజుకుంది. తాత్కాలిక డేటా ప్రకారం, భారతదేశం మంగళవారం కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క 1.25 కోట్లకు పైగా మోతాదులను ఇచ్చింది,












Click it and Unblock the Notifications