వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ వ్యాక్సీన్: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా... కేంద్రం ప్రకటన

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వ్యాక్సీన్

మే నెల 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృత స్థాయిలో అందరికీ వర్తించేలా ఉంటుందని ప్రభుత్వం వెల్లడి చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

మూడో దశ వ్యాక్సినేషన్ వ్యూహంలో భాగంగా దేశంలోని వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు కేంద్ర ఔషధ ప్రయోగశాల విడుదల చేసిన డోసుల్లో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 50 శాతం డోసులను వారు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్‌కు ఇవ్వొచ్చని ప్రభుత్వం ఆదేశించింది.

https://twitter.com/ANI/status/1384140696982941696

కేంద్ర ప్రభుత్వం తనకు లభించిన వాటాలోని టీకాల డోసులను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయిస్తుంది. ఈ కేటాయింపులు ఆయా రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తీవ్రతను ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తారు.

వ్యాక్సీన్ డోసులను 50 శాతం కేంద్రానికి, 50 శాతం ఓపెన్ మార్కెట్‌కు ఇవ్వడమనే నిబంధన భారతదేశంలోని అన్ని వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలకు వర్తిస్తుంది. అయితే, పూర్తిగా వినియోగానికి సిద్ధంగా దిగుమతి అయిన టీకాలను ప్రభుత్వేతర మార్గాలలో ఉపయోగిస్తారని కేంద్రం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid Vaccine:Vaccine for everyone over the age of 18 from May 1
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X