వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆవులు పెంచడాన్ని తాము గర్వంగా భావిస్తాం, కానీ కొందరికి అది పాపంగా: ప్రతిపక్షాలపై మోడీ

|
Google Oneindia TeluguNews

లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. తమకందరికీ(బీజేపీ ప్రభుత్వానికి) గోవుల పోషణ, పెంచడాన్ని ఒక పుణ్యకార్యమని.. అయితే, అది కొందరికి పాపంగా అనిపిస్తుందని ప్రతిపక్షాలపై మండిపడ్డారు ప్రధాని మోడీ. ఆవులు, గేదెలపై జోకులు వేసే వారు కోట్లాది మంది జీవనోపాధిని మరచిపోతారని ఆయన అన్నారు.

తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో రూ. 870 కోట్లకు పైగా విలువైన 22 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని ఈ విషయం చెప్పారు. గురువారం ఉదయం ఇక్కడికి చేరుకున్న ప్రధాని మోడీ.. కర్ఖియావ్‌లోని ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఫుడ్ పార్క్‌లో "బనాస్ డెయిరీ సంకుల్" కు శంకుస్థాపన చేసి, డెయిరీ రంగంపై ప్రభుత్వం అత్యధిక దృష్టి సారించిందని చెప్పారు.

Cow sin for opposition, pride for us: PM Modi lays foundation stone of Banas Dairy Sankul in Varanasi

'గత ఆరు నుంచి ఏడేళ్లతో పోలిస్తే భారతదేశంలో పాల ఉత్పత్తి దాదాపు 45 శాతం పెరిగింది. నేడు ప్రపంచంలోని పాల ఉత్పత్తిలో భారత్‌ దాదాపు 22 శాతం ఉత్పత్తి చేస్తోంది. ఈ రోజు యూపీ అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే రాష్ట్రం మాత్రమే కాదు. డెయిరీ రంగం విస్తరణలో కూడా దేశంలోనే ముందుంది" అని ప్రధాని మోడీ అన్నారు.
విద్య, ఆరోగ్య రంగాలలో అనేక ప్రాజెక్టులను కూడా ప్రధాని ఆవిష్కరించారు.

వారణాసిలోని కార్ఖియాన్వ్‌లో రూ.1,225.51 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.2,100 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులను ప్రధానమంత్రి వారణాసి ప్రజలకు అంకితం చేశారు. 10 రోజుల్లో మోడీ తన నియోజకవర్గంలో పర్యటించడం ఇది రెండోసారి కావటం విశేషం.

వారణాసి రైతులు, పశువుల పెంపకందారులకు ఈ రోజు గొప్ప రోజు అని ప్రధాని అన్నారు. గోమాతలను సంరక్షించటానికి బీజేపీ ప్రభుత్వం ఎంతో చేస్తోందని ఆవులను కాపాడటంలో బీజేపీ ప్రభుత్వం గర్వపడుతోందని అన్నారు. ఆవు కొంతమందికి కేవలం ఓ పశువుగానే చూస్తారు. కానీ మనకు ఆవు తల్లి. ఆవును ఎగతాళి చేసే వ్యక్తులు దేశంలోని 8 కోట్ల మంది ప్రజల జీవనోపాధి ఆవుల ద్వారానే నడుస్తోందన్న విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు.

భారతదేశం ఏటా ఎనిమిదిన్నర లక్షల కోట్ల విలువైన పాలను ఉత్పత్తి చేస్తోందని ప్రధాని మోడీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. బనాస్ డెయిరీ ప్లాంట్ వల్ల పూర్వాంచల్‌లోని దాదాపు 6 జిల్లాల ప్రజలు ఉద్యోగాలు పొందడమే కాకుండా రైతులు, పశువుల యజమానులు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

Recommended Video

Modi-Putin Talks : AK-203 Rifles Mega Deal, S-400 | Defence Updates || Oneindia Telugu

మన ప్రాంగణంలో పశువులు ఉండటం శుభానికి సంకేతమని.. ఆవు నా చుట్టూ ఉండాలి, నేను గోవులలో నివసించాలి అని మన గ్రంధాలలో కూడా చెప్పబడిందని గుర్తుచేశారు ప్రధాని మోడీ. పాడి పరిశ్రమ కోసం కామధేను కమిషన్‌ను ఏర్పాటు చేశామని, రైతులను కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో అనుసంధానం చేశామని ప్రధాని మోడీ వెల్లడించారు.

English summary
Cow sin for opposition, pride for us: PM Modi lays foundation stone of Banas Dairy Sankul in Varanasi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X