హేతువాది గోవింద్ పన్సార్ హత్య: స్కెచ్ వేసింది వీడే

న్యూఢిల్లీ/ కొల్హాపూర్: హేతువాది, కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకుడు గోవింద్ పన్సార్ (82) హత్య కేసులో ఇద్దరి కోసం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్ ) గాలిస్తుంది. రుద్ర పాటిల్ (34)తో సహ ఇద్దరి కోసం మహారాష్ట్ర, కర్ణాటక, గోవా ప్రాంతాలలో గాలిస్తున్నామని సిట్ ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్ చెప్పారు.

ఇదే సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదిన కొల్హాపూర్ లోని గోవింద్ పన్సారే ఇంటి సమీపంలో ఉన్న సమయంలో బైక్ లో వెళ్లిన ఇద్దరు రివాల్వర్ తో ఆయనను కాల్చి హత్య చేశారు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కర్ణాటకకు చెందిన ఇద్దరిని, ముంబైకి చెందిన ఒకరిని విచారణ చేశారు.

CPI leader Govind Pansare murder case

తరువాత సమీర్ విష్ణు గైక్వాడ్ (32) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా రుద్ర పాటిల్, మరో వ్యక్తి పేరు బయటకు వచ్చింది. కర్ణాటకు చెందిన మాజీ ఉప కులపతి డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి అనే ఆయను దారవాడలోని ఆయన ఇంటిలోనే కాల్చి హత్య చేశారు.

ఇదే కేసులో రుద్ర పాటిల్ ప్రధాన నిందితుడు అని పోలీసులు అతని ఫోటో సైతం మీడియాకు విడుదల చేశారు. ఇప్పుడు గోవింద్ పన్సారే హత్యతో రుద్ర పాటిల్, సారంగ్ అకోల్కర్ లకు సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు అంటున్నారు. వీలైనంత త్వరగా వీరిని పట్టుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+