Criminal: ఆంటీతో సహజీవనం, చంపేసి తాళం వేసి ? రాత్రి భార్య, పిల్లలతో ?, క్రిమినల్ !
న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే సిటీలో ఓ మహిళ ఆమె కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నది. భార్యతో కాపురం చేస్తున్న వ్యక్తి భర్తకు దూరంగా ఉంటున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వివాహం చేసుకోకుండానే ఇద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నారు. తల్లి వేరే వ్యక్తితో సహజీవనం సాగిస్తోందని కూతురు తెలుసు. అయితే భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతని భార్యకు మాత్రం తెలీదు. సహజీవనం చేస్తున్న మహిళను పదునైన ఆయుధాలతో హత్య చేసిన ఆమె ప్రియుడు ఎస్కేప్ అయ్యాడు. ప్రియుడి చేతిలో ఆంటీ హత్యకు గురైయ్యిందని వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆంటీని హత్య చేసింది ఒక క్రిమినల్ అని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

భార్యతో కాపురం
ఢిల్లీలోని వెస్ట్ విహార్ ప్రాంతంలో మన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్న మన్ ప్రీత్ సింగ్ అతని భార్య, పిల్లలతో కలిసి వెస్ట్ విహార్ లోనే చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు. మన్ ప్రీత్ సింగ్ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది.

భర్తను వదిలేసిన మహిళతో ?
ఢిల్లీలోని వెస్ట్ విహార్ సమీపంలోనే రేఖా రాణి అలియాస్ రేఖా అనే మహిళ నివాసం ఉంటున్నది. రేఖా రాణి ఆమె కుమార్తెతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నది. భర్తకు దూరంగా ఉంటున్న రేఖా రాణితో ఆరు సంవత్సరాల క్రితం మన్ ప్రీత్ సింగ్ కు పరిచయం అయ్యింది. తరువాత మన్ ప్రీత్ సింగ్, రాణి రేఖా అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

ఆంటీ కూతురికి అసలు మ్యాటర్ తెలుసు
ఐదు సంవత్సరాల నుంచి మన్ ప్రీత్ సింగ్, రేఖా రాణి వివాహం చేసుకోకుండానే ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. తన తల్లీ రేఖా రాణి వివాహం చేసుకోకుండానే మన్ ప్రీత్ సింగ్ తో సహజీవనం సాగిస్తోందని కూతురు తెలుసు. అయితే తల్లిని ఎదిరించలేక ఆ అమ్మాయి సైలెంగ్ గా ఉందని సమాచారం.

ఆంటీతో గొడవలు
మన్ ప్రీత్ సింగ్ వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న రేఖా రాణితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతని భార్యకు మాత్రం ఇంతవ వరకు తెలీదు. అయితే రాత్రి రేఖా రాణి ఇంటికి వెళ్లిన మన్ ప్రీత్ సింగ్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో మన్ ప్రీత్ సింగ్, రేఖా రాణిల మద్య మాటామాటా పెరిగిపోయింది.

ప్రియురాలిని చంపేసి ఎస్కేప్
రేఖా రాణిని ఆంటీ ముఖం మీద, మెడ మీద పదునైన ఆయుధంతో దాడి చేసిన మన్ ప్రీత్ సింగ్ ఆమెను చంపేశాడు. ఆ సందర్బంలో రేఖా రాణి కుమార్తె ఇంట్లో లేదు. ప్రియురాలు రేఖా రాణిని హత్య చేసిన తరువాత ఇంటి బయట తాళం వేసిన మన్ ప్రీత్ సింగ్ అతని ఐ 20 కారులో అక్కడి నుంచి పరారైనాడని ఢిల్లీ వెస్ట్ డిప్యూటీ పోలీసు కమీషనర్ ఘన్ శ్యామ్ బన్సాల్ శనివారం మీడియాకు చెప్పారు.

ప్రియుడు క్రిమినల్, ఇప్పటికే ఆరు కేసులు
రేఖా రాణి కుమార్తె తన తల్లి కనపడటం లేదని ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి తలుపు తాళం పగలగొట్టి చూస్తే లోపల ఆమె శవమై కనిపించింది. రేఖా రాణిని హత్య చేసిన ఆమె ప్రియుడు మన్ ప్రీత్ సింగ్ పాత నేరస్తుడని, అతని మీద ఇప్పటికే ఆరు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ పోలీసు కమీషనర్ రవీంద్ర సింగ్ యాదవ్ శనివారం మీడియాకు చెప్పారు.

రేఖా హత్యకు అదే కారణం
రేఖా రాణిని హత్య చేసి ఆమె ప్రియుడు, పాతనేరస్తుడు మన్ ప్రీత్ సింగ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ పోలీసు కమీషనర్ రవీంద్ర సింగ్ యాదవ్ మీడియాకు చెప్పారు. చాలాకాలం నుంచి మన్ ప్రీత్ సింగ్, రేఖా రాణిల మీద చాలా గొడవలు ఉన్నాయని, ఇదే హత్యకు దారి తీసిందని పోలీసులు అంటున్నారు.
-
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications