పోలీసులను చూస్తే క్రిమినల్స్ ప్యాంట్లు తడుస్తాయ్.. పంజాబ్ సీఎం చన్నీ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుంది. దీంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దానిని సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కవర్ చేసే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఆయన జలందర్ ఆర్మ్‌డ్ పోలీస్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దూ చేసిన కామెంట్లను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
పంజాబ్‌లో పోలీసులను చూస్తే క్రిమినల్స్ ప్యాంట్ తడుపుకుంటున్నారని చన్నీ అన్నారు. అంతేకాదు పోలీసులు తప్పు పట్టుకోవద్దని.. తమ విధులను సక్రమంగా చేయాలని చన్నీ కోరారు. ఏ నేత అయినా పోలీసులపై కామెంట్స్ చేస్తే.. అదీ వారిపై కాకుండా పంజాబ్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలుగా పరిగణిస్తానని వివరించారు. ఇటీవల పోలీసులపై సిద్దూ కామెంట్ చేయడంతో చన్నీ ఈ మేరకు వారిని కూల్ చేసే ప్రయత్నం చేశారు.

అంతేకాదు తన గురించి 100 మంది తప్పుగా చెప్పిన.. తాను పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్తానని చెప్పారు. సామాన్యుల సంక్షేమం కోసం పనిచేస్తానని వివరించారు. తమ పోలీసులు కూడా అలాగే వర్క్ చేస్తారని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే నవతేజ్ సింగ్ చీమ కూడా ర్యాలీలలో పాల్గొన్నారు.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు తలుచుకుంటే పోలీసుల ఫ్యాంట్లు తడిచిపోయేలా చేయగలరని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రశంసించే క్రమంలో ఆయన కామెంట్స్ చేశారు. దీంతో ఆయన పై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు ఆయన పై పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై మీడియా ప్రతినిధులు సిద్దూను ప్రశ్నించగా.. ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ క్రమంలో చన్నీ సమర్థించే ప్రయత్నం చేశారు. పోలీసులకు అనుకూలంగా కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications