House owner: విద్యార్థిని మూడు ముక్కలుగా నరికేసిన ఇంటి యజమాని, రూ. కోటి కోసం !
లక్నో/ఉత్తరప్రదేశ్: ఓ యువకుడు కాలేజ్ లో చదువుకోవడానికి ఓ ఊరికి వెళ్లాడు. అద్దె ఇంటిలో ఉంటున్న ఆ యువకుడు చదువుకుంటున్నాడు. రెండు నెలలు, మూడు నెలలకు ఒకసారి ఆ యువకుడు అతని సొంత ఊరికి వెలుతున్నాడు. కొన్ని నెలల నుంచి యువకుడి ఆచూకి లేకపోవడం, అతని నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడంతో అతని బంధువులకు అనుమానం వచ్చింది. యువకుడి కోసం ఆరాతీస్తే అప్పుడు అసలు మ్యాటర్ తెలిసింది. యువకుడిని అతను నివాసం ఉంటున్న ఇంటి యజమాని హత్య చేసి అతని శవాన్ని మూడు ముక్కలుగా నరికేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

పీహెచ్ డీ చేస్తున్న యువకుడు
ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ జిల్లాలోని మోదీనగర్ లో ఉమేష్ శర్మా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పత్ ప్రాంతంలో అంకిత్ ఖోఖర్ అలియాస్ అంకిత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మోదీ నగర్ కు చేరుకున్న అంకిత్ లక్నో యూనివర్శిటీలో పీహెచ్ డీ చదువుకుంటున్నాడు.

యజమానితో కాలేజ్ అబ్బాయి క్లోజ్
మోదీ నగర్ లోని ఉమేష్ శర్మా భవనంలోని ఓ ఇంటిని అంకిత్ అద్దెకు తీసుకుంటున్నాడు. ఉమేష్ శర్మా ఇంటిలో ఉంటున్న అంకిత్ పీహెచ్ డీ చేస్తున్నాడు. ఇంటి యజమాని ఉమేష్ శర్మాతో కాలేజ్ యువకుడు అంకిత్ కొంచెం క్లోజ్ గా ఉంటున్నాడు. ఇదే సమయంలో అంకిత్ అతని పర్సనల్ విషయాలు అన్నీ ఇంటి యజమాని ఉమేష్ శర్మాకు చెబుతూ వస్తున్నాడు.

రూ. 1 కోటి ఆస్తి విక్రయం
పీహెచ్ డీ విద్యార్థి అంకిత్ కొన్ని నెలల క్రితం అతని పూర్వికుల ఆస్తి విక్రయించడంతో అతనికి రూ. 1 కోటి డబ్బు వచ్చింది. ఈ విషయం అంకిత్ నివాసం ఉంటున్న ఇంటి యజమానికి తెలిసింది. నెల రోజుల తరువాత అంకిత్ అతని ఇంటి యజమాని ఉమేష్ శర్మాకు రూ. 40 లక్షలు అప్పు ఇచ్చాడని తెలిసింది.

చంపేసి శవాన్ని మూడు ముక్కలు చేశాడు
అంకిత్ దగ్గర ఉన్న డబ్బు మొత్తం లాగేయాలని ఇంటి యజమాని ఉమేష్ శర్మా స్కెచ్ వేశాడు. రెండు నెలల క్రితం అంకిత్ ను హత్య చేసి అతని శవాన్ని మూడు ముక్కలు చేసి అల్యూమినియం బాక్స్ లో ప్యాక్ చేశారు. తరువాత ముజఫర్ నగర్ లోని ఖతౌలిలోని కాలువలో ఓ భాగం. మస్సూరి కాలువలో రో భాగం. ఎక్స్ ప్రెస్ హైవేలో మరో భాగం విసిరేసిన ఇంటి యజమాని ఉమేష్ శర్మా చేతులు దులుపుకున్నాడు.

ఏటీఎంలో రూ. 20 లక్షలు డ్రా
అంకిత్ ను హత్య చేసిన తరువాత అతని ఏటీఎం కార్డును ఇంటి యజమాని ఉమేష్ శర్మా తీసుకున్నాడు. అంకిత్ స్నేహితుడు పర్వేష్ కు మాయమాటలు చెప్పిన ఉమేష్ శర్మా అతనికి డబ్బు ఆశ చూపించి అతన్ని లొంగదీసుకున్నాడు. ఏటీఎం పిన్ కోడ్ ముందే తెలియడంతో అంకిత్ స్నేహితుడు పర్వేష్ సహాయంతో వివిద ప్రాంతాల్లో, జార్ఖండ్ లో రూ. 20 లక్షలు ఏటీఎంలో డ్రా చేసుకున్నారు.

మ్యాటర్ లీక్ అయ్యింది
పీహెచ్ డీ విద్యార్థి అంకిత్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడం, అతను ఊరికి రాకపోవడంతో అతని బంధువులకు అనుమానం వచ్చింది. అంకిత్ కోసం అతని బంధువులు ఆరాతీస్తే అప్పుడు అసలు మ్యాటర్ తెలిసింది. అంకిత్ ను అతను నివాసం ఉంటున్న ఇంటి యజమాని ఉమేష్ శర్మా హత్య చేసి అతని శవాన్ని మూడు ముక్కలుగా నరికేశాడని వెలుగు చూడటం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. ఢిల్లీలో ప్రియురాలు శ్రద్దాను ఆమె ప్రియుడు 35 ముక్కలుగా నరికిన కేసు వెలుగు చూసిన తరువాత దేశంలో ఇలాంటి కేసులు చాలా ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications