కారుపై కాకి వాలిందనీ! కొత్త కారు కొన్న ముఖ్యమంత్రి

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్తకారు కొనుక్కోవడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన కారు కొంటే దానిపై ఇంత పెద్ద చర్చ ఎందుకనుకుంటున్నారా? ఇది చదవండి.. ఇటీవల సీఎం సిద్ధరామయ్య పాతకారుపై ఓ కాకి వాలిందని.. దీంతో సీఎం తన కారును మార్చేశాడని పలు టీవీ ఛానళ్లలో విస్తృత ప్రచారం జరిగింది.

అసలు విషయానికొస్తే... కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కారుపై జూన్‌ 2న ఓ కాకి వాలింది. డ్రైవర్‌ తరిమికొట్టినా వెళ్లకుండా.. దాదాపు 10 నిమిషాల పాటు కారుపై ఉండిపోయిందా కాకి. ఆ ఘటనకు సంబంధించిన వీడియో.. కర్ణాటక టీవీ ఛానళ్లలో వైరల్‌గా మారింది.

అయితే సాధారణంగా.. కాకిని చెడు శకునంగా భావిస్తుంటారు. కాగా, ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య శనివారం రూ. 35లక్షలు పెట్టి టొయోటా ఫార్చ్యునర్‌ కారు కొనుగోలు చేశారు.

దీంతో కాకి వాలడం వల్లే సీఎం సిద్ధరామయ్య కొత్త కారు కొనేశారంటూ వార్తలు వెలువడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయాన్నీ ప్రతిపక్షాలు తమ ఆరోపణలకు ఆయుధంగా మలచుకునే అవకాశం లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+