వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్: 800 ఉద్యోగులను తొలగించిన క్యుర్.ఫిట్, ఆన్ లైన్‌లో సేవలు..

|
Google Oneindia TeluguNews

కల్ట్ డాట్ ఫీట్ మాతృసంస్థ క్యూర్ ఫిట్ తన ఉద్యోగులను తొలగించింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల కాస్ట్ కట్ చర్యల చేపట్టింది. దేశవ్యాప్తంగా 800 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. దేశవ్యాప్తంగా చిన్న సెంటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. క్యుర్ ఫిట్ జిమ్, వెల్ నెస్ సెంటర్లతో కొద్దికాలంతోనే మంచి పేరు తెచ్చుకున్నది.

2016లో స్టార్ట్..

2016లో స్టార్ట్..

మాజీ ఫ్లిప్ కార్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు కలిసి 2016లో కంపెనీని సింగపూర్ ఇన్వెస్టర్ తెమసెక్ హోల్డింగ్ పెట్టుబడి పెట్టగా స్థాపించారు. జిమ్, వెల్ నెస్ సెంటర్లు కావడంతో దేశంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో 130 లొకేషన్లలో సెంటర్స్ నెలకొల్పారు. లాక్ డౌన్ వల్ల బెంగళూరులో కంపెనీని మూసివేశారు. దీంతోపాటు మరికొన్ని కేంద్రాలు కూడా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

దుబాయ్‌లో కూడా..

దుబాయ్‌లో కూడా..

దేశంలో మంచి బూమ్ వచ్చాక గతేడాది జూన్‌లో దుబాయ్‌లో క్యుర్ ఫిట్ తన బ్రాంచీని నెలకొల్పింది. అయితే అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో అనే అంశంపై స్పష్టత లేదు. దేశంలో మాత్రం 5 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా క్యుర్ డాట్ ఫిట్, ఈట్ ఫిట్‌లో పనిచేస్తున్నారు. ఈట్ ఫిట్‌లో ఆరోగ్యకరమైన ఫుడ్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల తొలగింపుపై క్యుర్ డాట్ ఫిట్ స్పందించలేదు.

Recommended Video

Women Waiting In Queue In Front Of Wine Shops , Pics Viral
ట్రైనర్ల ఇబ్బందులు

ట్రైనర్ల ఇబ్బందులు

కంపెనీ ప్రస్తుతం క్లోజ్ చేయడంతో తమ కుటుంబాన్ని ఎలా నడుపాలని ఫిట్ నెస్ ట్రైనర్లు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ సమయంలో కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదన్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన బాక్సర్ సుర్జిత్ సింగ్ 11 నెలల క్రితం బెంగళూరులో ఫిట్ నెస్ ట్రైయినర్‌గా చేరారు. కానీ ప్రస్తుతం క్లోజ్ చేయడంతో.. ఉపాధి లేక నిట్టూరుస్తున్నారు. మరికొందరు ఉద్యోగులు మాత్రం కంపెనీ అన్నింటినీ ఆన్ లైన్ చేసిందని చెబుతున్నారు. ఇప్పటికే వర్జువల్ పర్సన్ ట్రైనింగ్ కూడా జరుగుతోందని తెలిపారు. కానీ 800 మంది ఉద్యోగులను తొలగించడంతో వారు ఉఫాధి లేకుండా అయిపోయారు.

English summary
Indian gym and wellness startup cure.fit has laid off as many as 800 of its staff across the country and permanently closed a number of fitness centres
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X