39 మంది భార్యలు, 200 ఓట్లు: ఇంటికి నేతల ప్రదక్షిణ
ఐజ్వాల్: ఒకే ఇంట్లో రెండు వందల ఓట్లు ఉండటంతో ఆ ఇంటి చుట్టూ రాజకీయ నాయకులు ప్రదక్షిణలు చేస్తున్న చిత్రం మిజోరం ఎన్నికలలో కనిపిస్తోంది. వచ్చే నెలలో శాసనసభ మిజోరాంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని తుయ్ కుమ్ నియోజకవర్గం పరిధిలోని బక్త్వాంగ్ గ్రామానికి చెందిన జియోనా ఛనా అనే అరవై ఎనిమిదేళ్ల వయసు గల వ్యక్తి ఇంట్లో 200కు పైగా ఓట్లు ఉన్నాయి.
దీంతో రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. తమకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. జియోనా ఛనాకు 39 మది భార్యలు. ఆయన కుటుంబ సభ్యుల సంఖ్య 186. ఆయన బంధువులు కూడా ఆయన కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు.

దీంతో ఆ కుటుంబంలో ఉన్న వారి సంఖ్య రెండు వందలు దాటింది. ఛన్నా తెగకు చెందిన వీరి సమాజంలో బహుభార్య విధానం ఉంది. బక్త్వాంగ్ గ్రామం చుట్టుపక్కల పల్లెల్లో ఈ తెగ ప్రజలు వేలల్లో ఉన్నారు. జియోనా కుటుంబం నాలుగు అంతస్థులు, వంద గదులు గల పెద్ద ఇంట్లో ఉంటున్నారు. వీరి కుటుంబం వ్యాపారాలు నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications