కిషన్ రెడ్డికి కీలకమైన టూరిజం: కల్చరల్, నార్త్ ఈస్ట్రన్ డెవలప్ మెంట్ కూడా
కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు ప్రధాని మోడీ. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కిషన్ రెడ్డికి మూడు శాఖలను అప్పగించారు. తనకు ఏ శాఖ ఇచ్చినా.. బాధ్యతగా పనిచేస్తానని కిషన్ రెడ్డి స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. సాంసృతిక శాఖను అప్పగించారు. దాంతోపాటు పర్యాటక శాఖ, నార్త్ ఈస్ట్రన్ రీజియన్ డెవలప్ మెంట్ బాధ్యతను కూడా కట్టబెట్టారు.
కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది. సహాయ మంత్రి నుంచి కేంద్ర మంత్రి పదవీ వరించింది. ఇక నుంచి కిషన్ రెడ్డి కల్చరల్ పోర్టు పోలియో నిర్వహిస్తారు. కరోనా వల్ల పర్యాటక రంగం కుదేలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు టూరిజం మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కీలక బాధ్యతను ప్రధాని మోడీ కిషన్ రెడ్డికి ఇచ్చారు. దానిని నెరవేర్చాల్సిన బాధ్యత అతనిపై ఉంది. నార్త్ ఈస్ట్రన్ డెవలప్ మెంట్ డ్యూటీ కూడా ఉంది.

తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవీ వచ్చింది. ఇదివరకు ఎవరికీ డైరెక్ట్ పోస్టు దక్కలేదు. ఏపీలో పదవులు చేపట్టినా వారు ఉన్నారు. తెలంగాణ నుంచి లేరు. ఇదివరకు బండారు దత్తాత్రేయ స్వతంత్ర హోదాతో మంత్రి పదవీ చేపట్టారు. తెలంగాణ గడ్డ నుంచి ప్రధానమంత్రి పదవీని పీవీ నరసింహారావు చేపట్టారు. ఆయన తప్ప కేంద్ర మంత్రిగా పనిచేసిన వారు లేరు.












Click it and Unblock the Notifications