Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అట్టుడుకుతున్న మణిపూర్: 8 జిల్లాల్లో కర్ఫ్యూ, మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలోని చురాచాంద్‌పూర్ జిల్లా అల్లర్లతో అట్టుడుకుతోంది. పరిస్థితి నివురుకప్పిన నిప్పులా ఉండటంతో పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. జిల్లా వ్యాప్తంగా పబ్లిక్ కర్ఫ్యూ విధించారు. కంగ్వాల్, టుయుబాంగ్, చురచంద్‌పూర్ సబ్ డివిజన్‌లకు ప్రత్యేకంగా ఈ ఉత్తర్వు జారీ చేశారు. మణిపూర్‌లోని 8 జిల్లాల్లో కర్యూ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.

మరోవైపు, ఉద్రిక్తత దృష్ట్యా బిష్ణుపూర్ జిల్లాలో తక్షణమే 144 సెక్షన్ అమలు చేశారు. ఇక్కడ ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకుండా నిషేధించారు. తదుపరి ఆదేశాల వరకు పబ్లిక్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. మణిపూర్ జిల్లా మేజిస్ట్రేట్ చురచంద్‌పూర్ జిల్లాలోని కంగ్వాల్, టుయుబాంగ్, చురచంద్‌పూర్ సబ్-డివిజన్‌లలో మొత్తం పబ్లిక్ కర్ఫ్యూ విధించారు.

Curfew in 8 districts of Manipur, mobile internet services suspended over tribal stir

ఈ క్రమంలో తమ నివాసం వెలుపల ఎవరి కదలికపైనా పూర్తి నిషేధం ఉంటుంది. ఈ ఆర్డర్ తక్షణమే అమల్లోకి వస్తుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుంది. శాంతి, ప‌బ్లిక్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిర‌క్షించ‌డంతోపాటు మ‌నుషుల ప్రాణ‌లు, ఆస్తుల‌ను కాపాడేందుకు ఈ ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత కలిగిన ప్రభుత్వ సంస్థలకు ఈ ఆర్డర్ వర్తించదు.

బిష్ణుపూర్ జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ కూడా మొత్తం జిల్లాలో నిషేధాజ్ఞలను (సెక్షన్-144) అమలు చేశారు. దీని ప్రకారం, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడిన సమూహాలుగా తిరగకూడదు. శాంతిభద్రతలకు భంగం కలిగించే.. కర్రలు, రాళ్లు, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా తుపాకీలను తీసుకెళ్లడం, ఆయుధాలు, ఆయుధంగా ఉపయోగించగల వస్తువులపై నిషేధం విధించారు.

ఈ ఆర్డర్ కూడా తక్షణమే అమలులోకి వచ్చింది. చురచంద్‌పూర్ నగరంలో పరిస్థితులకు సంబంధించి వీడియో కూడా బయటపడింది. దీనిలో గుంపు ఇళ్లను ధ్వంసం చేసింది, దీని కారణంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మరోవైపు నిరసనల నేపథ్యంలో ఐదు రోజుల పాటు మొబైల్-ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

వాస్తవానికి మణిపూర్‌లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ బుధవారం ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇంతలో, చురచంద్‌పూర్, బిష్ణుపూర్ జిల్లాల్లో గందరగోళం తర్వాత పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. దీంతో జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది.

షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కోసం ఇంఫాల్ లోయలో ఆధిపత్యం చెలాయించే గిరిజనేతర మైటీస్ డిమాండ్‌ను నిరసిస్తూ చురచంద్‌పూర్ జిల్లాలోని టోర్‌బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపునిచ్చిన 'గిరిజన సంఘీభావ యాత్ర'లో హింస చెలరేగింది. ఈ క్రమంలోనే హింసాత్మతక ఘటనలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు కఠన చర్యలు తీసుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+