బాలీవుడ్ తారకు కరెంట్ బిల్లు మోత, టాటా పవర్‌కు ట్వీట్, లాక్ డౌన్ గిప్టా అంటూ..
లాక్‌డౌన్ సమయంలో కరెంట్ బిల్లుల షాక్ సామాన్యులకే కాక ప్రముఖులకు కూడా తగిలింది. తారలు కూడా ఇందుకు అతీతులు కారు. తాప్సీ, రీచా చడ్డా, సోహ అలీఖాన్ కూడా కరెంట్ బిల్లుల మోతను ప్రపంచానికి చూపారు. అయితే చాన్నాళ్ల తర్వాత మరో తార కరెంట్ బిల్లు బారినపడ్డారు. తనకు రూ.51 వేల బిల్లు వచ్చిందని దివ్య ట్వీట్ చేశారు.
Recommended Video
వాస్తవానికి లాక్ డౌన్ సమయంలో బిల్లు తీయకపోవడంతో చాలా మందికి ఎక్కువే వచ్చింది. కొంతమంది బిల్లు సరిచేయగా.. మరికొందరివీ అలానే వదిలేశారు. ఇక తారల గురించి అయితే చెప్పక్కర్లేదు. రూ.51 వేల బిల్లు వచ్చిందని దివ్య ట్వీట్ చేశారు. టాటా పవర్ ఏమైంది మీకు.. నెలకు కరెంట్ బిల్ రూ.51 వేల అని అడిగారు. లాక్ డౌన్ గిప్ట్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా అని అడిగారు. దీనిని వెంటనే సరిచేయాలని ఆమె టాటా పవర్‌ను కోరారు.

దివ్య ట్వీట్‌కు టాటా పవర్ స్పందించింది. మా కంపెనీ నుంచి ఫోన్ చేస్తారు.. వివరాలు తెలుపాలని కోరింది. దీనికి దివ్యా దత్తా ఒకరు ఫోన్ చేశారని మరో ట్వీట్ చేశారు. అతను తన సమస్యను పరిష్కరిస్తానని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు భవిష్యత్‌లో ఇలాంటి షాక్ తగలకుండా ఉండగలదని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. సమస్యపై కంపెనీ స్పందించినందుకు దివ్యా థాంక్స్ చెప్పారు.












Click it and Unblock the Notifications