2 గ్రూపులు ఆయుధాలతో కొట్టుకుంటుంటే, తాపీగా వీడియో తీశారు
బెంగళూరు: కర్నాటకలో దారుణం జరిగింది. మరో షాకింగ్ విషయమేంటే ఆ దారుణాన్ని ప్రజలు కళ్లారా చూస్తూ కూడా ఆపలేకపోయారు. మరికొందరు అయితే దానిని తమ తమ సెల్ వీడియో తీశారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం మంగళవారం నాడు హసన్ నగరంలోని బస్ స్టాండులో జరిగింది.
ఇది బెంగళూరుకు 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రెండు గ్రూపులు తగాదాపడ్డాయి. ఇరు వర్గాలు కూడా ప్రాణాంతకమైన ఆయుధాలు పట్టుకొని ఘర్షణకు దిగారు. అక్కడ అప్పుడు వందల మంది ఉన్నారు. కానీ ఎవరూ కూడా స్పందించలేదు. కనీసం పోలీసులకు కూడా ఫోన్ చేయలేదు.

మరో విషయమేమంటే ఒకరిద్దరు వ్యక్తులు ఆ ఘటనను తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పెట్టారు. అంత గొడవ జరుగుతున్నా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడాన్ని వీడియోలో చూసిన పోలీసులు షాకయ్యారు.
దీనిపై హసన్ ఎస్పీ రాహుల్ కుమార్ మాట్లాడుతూ.. రెండు గ్రూపులు కనీసం 8 నిమిషాల పాటు ఘర్షణ పడ్డాయని, అక్కడ చూస్తున్న వారు పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదని, వారి గొడవను చూస్తూ ఉండిపోయారని చెప్పారు. ఆ తర్వాత పది నిమిషాలకు విషయం తెలిసి, పోలీసులు వెళ్లి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారని చెప్పారు.












Click it and Unblock the Notifications