ములాయం సింగ్‌కు భంగపాటు: కొడుక్కి 'ఈసీ' బూస్ట్.. అఖిలేష్‌కే 'సైకిల్'
ఈసీ.. సైకిల్ గుర్తును అఖిలేష్ యాదవ్‌కు కేటాయించింది. అఖిలేష్ యాదవ్‌కు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు, నేతల మద్దతు ఉంది. దీంతో ఈసీ ఆ గుర్తును ఆయనకే కేటాయించింది.
లక్నో: ఇప్పటికే పార్టీలో ఎక్కువ మంది కొడుకు అఖిలేష్ యాదవ్‌కు మద్దతు పలుకుతున్నారు. ఇది తండ్రి ములాయం సింగ్ యాదవ్ షాక్. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ములాయంకు సోమవారం నాడు ఎన్నికల కమిషన్ మరో షాకిచ్చింది.
ఈసీ.. సైకిల్ గుర్తును అఖిలేష్ యాదవ్‌కు కేటాయించింది. అఖిలేష్ యాదవ్‌కు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు, నేతల మద్దతు ఉంది. దీంతో ఈసీ ఆ గుర్తును ఆయనకే కేటాయించింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

తాజాగా, ఈసీ నిర్ణయం నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ కొత్త సింబల్ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సైకిల్ గుర్తు రావడం అఖిలేష్‌కు పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. సైకిల్ గుర్తు సమాజ్ వాది పార్టీ గుర్తు. ఈ గుర్తుతోనే అఖిలేష్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.












Click it and Unblock the Notifications