వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 మంది మృతి, 6.5 లక్షల మంది తరలింపు, అంఫాన్ తుఫాన్‌పై దీదీ, 1 ట్రిలియన్ మేర ఆస్తి నష్టం..

|
Google Oneindia TeluguNews

అంఫాన్ తుఫాన్ పశ్చిమబెంగాల్, ఒడిశాలపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్ బుధవారం తీరం దాటే సమయంలో 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుకు ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుఫాన్ ప్రభావంతో 3 ముగ్గురు చనిపోయారని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.

Recommended Video

Amphan Super Cyclone Landfall Videos Between Digha and Hatiya, West Bengal
ముగ్గురు కాదు.. 12 మంది

ముగ్గురు కాదు.. 12 మంది

చనిపోయిన ముగ్గురు పశ్చిమబెంగాల్‌కు చెందినవారు కాగా.. ఒడిశాలో ఎవరూ చనిపోలేదు. ఉత్తర 24 పరగణ జిల్లాలో చెట్టు కూలీ మహిళ, పురుషుడు చనిపోగా, హౌరాలో 13 ఏళ్ల బాలిక కూడా చెట్టు కొమ్మలు పడి చనిపోయింది. కానీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం మృతుల 10 నుంచి 12 వరకు ఉంటుందని తెలిపారు. తుఫాన్‌పై బెంగాల్ సచివాలయంలో ఆమె ఉండి సమీక్షించారు. తుఫాన్‌తో ఉత్తర, దక్షిణ 24 పరగణ జిల్లాలో గల నందిగ్రాం, రామనగర్ గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని వివరించారు. 5500 ఇళ్లు ధ్వంసమైపోయాయని.. తుఫానుతో 1 ట్రిలియన్ మేర నష్టం వాటిల్లిందిదని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో నలుగురు

బంగ్లాదేశ్‌లో నలుగురు

పొరుగున గల బంగ్లాదేశ్‌లో తుఫాన్ వల్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో.. కొన్ని జిల్లాల్లో అంధకారం నెలకొంది. నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి 24 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. తుఫాన్ నేపథ్యంలో 15 వేల శిబిరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

6.58 లక్షల మంది తరలింపు

6.58 లక్షల మంది తరలింపు

బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగాల్‌లోని డిగా, బంగ్లాదేశ్‌లోని ద్వీపం హతియాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. దీంతో ఇప్పటికే 6.58 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. బెంగాల్‌లో 5 లక్షల మంది, ఒడిశాలో 1.58 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ 20 బృందాలు సహాయక పనులు చేపట్టాయి.

విరిగిన చెట్టు కొమ్మలు

విరిగిన చెట్టు కొమ్మలు

రహదారులపై చెట్లు విరిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెట్ల కొమ్మలు తొలగించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఒడిశాలో 19 బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అంఫాన్ సైక్లోన్ చూపించిన బీభత్సం ఫుటేజీ చూస్తే.. కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.

English summary
cyclone Amphan, packing winds of up to 190 kmph on Wednesday rampaged through coastal Odisha and West Bengal, dumping heavy rain, swamping homes and farmland, and leaving at least three people dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X