గుజరాత్ తీరాన్ని తాకిన బిపార్‌జాయ్ తుపాను: భీకర గాలులు, కుండపోత వర్షాలు

గాంధీనగర్: బీపార్జాయ్ తీవ్ర తుపాను గుజరాత్ రాష్ట్రం కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో గురువారం రాత్రి తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ తీరం వెంబడి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. కాగా, తుపాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు 6 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం తీర ప్రాంతాల్లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయానికి 120 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరం దాటే ప్రాంతంలో ఉన్న దాదాపు 20 గ్రామాలకు చెందిన ప్రజలను ఇప్పటికే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటి వరకు దాదాపు లక్ష మందిని తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Cyclone Biparjoy Landfall Process Starts At Gujarats Jakhau Port; Strong Winds And Rains in the state

బిపార్జాయ్ తుఫాను కారణంగా గుజరాత్, మహారాష్ట్రతోపాటు ఎనిమిది రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే తీర ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ తోపాటు భారత భద్రతా బలగాలు కూడా చేరుకున్నాయి. కాగా, గురువారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో బిపార్జాయ్ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలపారు. తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా.. ఆ తర్వాత వాయుగుండంగా బలహనీపడుతుందని వెల్లడించారు.

తుపాను ప్రభావంతో గుజరాత్ రాష్ట్రంలోని కచ్-సౌరాష్ట్ర, పోర్‌బందర్, ద్వారక, జామ్‌నగర్, రాజ్‌కోట్, జునాగఢ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, మోర్బీ తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 6 మీటర్ల మేర ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది.

బీపార్జోయ్ తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇప్పటికే ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఆలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. మొత్తం 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు రోడ్లు భవనాలకు చెందిన 115 బృందాలు, విద్యుత్ శాఖకు చెందిన 397 బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

అవసరమైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ దళాలను కూడా రంగంలో దించేందుకు కేంద్ర ప్రభుత్వం సిధ్దం చేసింది. మరోవైపు, తుపాను కారణంగా 76 రైళ్లను రద్దు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు గుజరాత్ రాష్ట్రంలో తుపాను పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. గుజరాత్ సీఎంను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+