వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాడర్‌తో సంబంధాలు కట్, 'విశాఖ' గజగజ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: హుధుద్ ఆదివారం మధ్యాహ్నం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో కాసేపు ప్రశాంతంగా ఉంటుందని, ప్రశాంతత తర్వాత కొద్దిసేపటికే ప్రచండ గాలులు వీస్తాయని, ప్రశాంతతగా అనిపించినప్పటికీ ఎవరు కూడా బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదివారం హెచ్చరించింది.

విశాఖపట్నం కైలాసగిరి వద్ద తుఫాను తీరం తాకింది. విశాఖలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖలో విద్యుత్ నిలిపి వేశారు. తూర్పు గోదావరిలోని గొల్లప్రోలులో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. తొండంగి ప్రాంతంలో అలలు ఎగిసిపడ్డాయి. రాడర్ కేంద్రంలోకి వర్షం నీరు ప్రవేశించింది. దీంతో తుఫాను హెచ్చరికల కేంద్రానికి రాడర్‌తో సంబంధాలు తెగిపోయాయి. రాడర్ కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపేశారు.

నాసా హెచ్చరిక

భారత తీరం వైపు దూసుకొస్తున్న హుద్‌హుద్‌ భయంకరమైన తుఫానా?.. నేలను తాకేపుడు అది బీభత్సం సృష్టించనుందా? దాని వల్ల విపరీతమైన నష్టం తప్పదా? అంటే.. అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ(నాసా) అవుననే అంటోంది. సాధారణంగా తుఫాన్ల పరిస్థితులపై నాసా హెచ్చరించడం కద్దు. కానీ, విశాఖ తీరాన్ని హుద్‌హుద్‌.. భయంకరమైన వేగంతో తాకుతుందని నాసా హెచ్చరించింది.

హుధుద్

హుధుద్


తుపాను వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు

హుధుద్

హుధుద్

ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విధుల్లో నిమగ్నమై ఉందని తెలిపారు. హుదూద్ తుపాను వల్ల ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశామని వెల్లడించారు.

హుధుద్

హుధుద్

ప్రస్తుతం సైక్లోన్ ఐ (నేత్రం) తీరాన్ని దాటిందని చెప్పారు. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రానికి రాడార్ తో కనెక్షన్ కట్ కావడంతో కరెక్ట్ గా సమాచారం అందడంలేదన్నారు.

హుధుద్

హుధుద్

అయినప్పటికీ అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

హుధుద్

హుధుద్

అయితే, తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మాత్రం మరికొన్ని గంటలు పడుతుందని చెప్పారు. తుపానును అరికట్టడం మన వల్ల కాదని... కానీ, నష్టాన్ని మాత్రం నివారించగలమని చెప్పారు.

హుధుద్

హుధుద్

హుదూద్ తుపాను కారణంగా కోస్తా తీరంలో సెల్ ఫోన్లు మూగబోయాయి. గంటలకు 200 కిలో మీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో సెల్ ఫోన్ సిగ్నళ్లకు అంతరాయం ఏర్పడుతోంది.

హుధుద్

హుధుద్

మరోవైపు బలమైన గాలులకు తీరం వెంట పలు ప్రాంతాల్లోని సెల్ టవర్లు కూడా నేలకూలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రధానంగా విశాఖ పరిధిలో సెల్ ఫోన్ సిగ్నళ్లు పనిచేయడం లేదు.

హుధుద్

హుధుద్

తుపాను గురించి హెచ్చరికలు అందించే విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రమే మూగబోయింది. హుదూద్ తుపాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షంతో హెచ్చరికల కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది.

హుధుద్

హుధుద్

భీకర గాలులకు భవనంలోని కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. దీంతో, తుపాను హెచ్చరికల కేంద్రానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.

 హుధుద్

హుధుద్

హుదూద్ తుపాను పంజా విసిరింది. దాని ధాటికి కోస్తా తీర ప్రాంతం చిగురుటాకులా వణుకుతోంది. విరుచుకుపడుతున్న హుదూద్ తుపాను ధాటికి విశాఖ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

హుధుద్

హుధుద్

ఇంటి పైకప్పు కూలి ఒకరు మృతి చెందగా, బహిర్భూమికి వెళ్లినప్పుడు తాడి చెట్టు విరిగి పడటంతో మరొకరు చనిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో చెట్టు విరిగి మీద పడటంతో ఒకరు మృతి చెందారు.

హుధుద్

హుధుద్

భీమిలి-కైలాసగిరి మధ్య తీరం దాటిన హుదూద్ ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతోంది. మరో గంటలో ఇది తీరాన్ని దాటనుంది. ప్రస్తుతం గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

హుధుద్

హుధుద్

అయితే, తీరం దాటే సమయంలో కాసేపు ప్రశాతంగా ఉండి... అనంతరం భీకర గాలులతో బెంబేలెత్తిస్తుంది. గాలి వేగం గంటకు 200 కిలోమీటర్లు కూడా దాటే అవకాశం ఉంది.

హుధుద్

హుధుద్

విశాఖ దక్షిణ ప్రాంతంలో ఉప్పెన విరుచుకుపడే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో ఎక్కడ చూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.

 హుధుద్

హుధుద్

హుధుద్ తుపాను విశాఖపట్నం పరిధిలోని భీమిలి-కైలాసగిరి మధ్య తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటలకు ఇది తీరాన్ని దాటింది

హుధుద్

హుధుద్

ప్రస్తుతం ఇది విశాఖకు 24 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీర ప్రాంతంలో 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరాన్ని దాటే సమయంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీసే అవకాశం ఉంది.

తీరం దాటక ముందే విశాఖపట్నంలో హుదూద్ తుపాను తన ప్రతాపాన్ని చూపుతోంది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం విశాఖను వణికిస్తోంది.

 హుధుద్

హుధుద్

గాలుల తీవ్రతకు జనం ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. నగరం మొత్తం నిర్మానుష్యంగా మారింది. నగర రోడ్ల మీద పెద్దపెద్ద చెట్లు విరిగిపడుతున్నాయి.

హుధుద్

హుధుద్


ఈ క్రమంలో, గాలుల తీవ్రతకు, వర్షానికి విశాఖలోని ఆర్డీవో ఆఫీసు కుప్పకూలింది. నగరంలోని కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా కొంతమేర దెబ్బతింది.

హుధుద్

హుధుద్

శరవేగంగా దూసుకొస్తున్న హుదూద్ ప్రభావంతో సముద్రం భయానకంగా మారింది. ఈ నేపథ్యంలో, విజయనగరం జిల్లా బోగాపురం మండలం ముక్కాములో రాకాసి అలలు 5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతూ, ఒడ్డున ఉన్న ఇళ్లలోకి చొచ్చుకు వస్తున్నాయి.

హుధుద్

హుధుద్

దీంతో, తమ నివాసాలు దెబ్బతింటాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రజలను బలవంతంగా సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు. ఇప్పటికే, సముద్రం ఒడ్డున ఉన్న పడవలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది.

హుధుద్

హుధుద్

గాలుల తీవ్రతకు జనం ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. నగరం మొత్తం నిర్మానుష్యంగా మారింది. నగర రోడ్ల మీద పెద్దపెద్ద చెట్లు విరిగిపడుతున్నాయి.

హుధుద్

హుధుద్

ఈ క్రమంలో, గాలుల తీవ్రతకు, వర్షానికి విశాఖలోని ఆర్డీవో ఆఫీసు కుప్పకూలింది. నగరంలోని కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా కొంతమేర దెబ్బతింది.

హుధుద్

హుధుద్

శరవేగంగా దూసుకొస్తున్న హుదూద్ ప్రభావంతో సముద్రం భయానకంగా మారింది. ఈ నేపథ్యంలో, విజయనగరం జిల్లా బోగాపురం మండలం ముక్కాములో రాకాసి అలలు 5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతూ, ఒడ్డున ఉన్న ఇళ్లలోకి చొచ్చుకు వస్తున్నాయి.

హుధుద్

హుధుద్

దీంతో, తమ నివాసాలు దెబ్బతింటాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రజలను బలవంతంగా సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు. ఇప్పటికే, సముద్రం ఒడ్డున ఉన్న పడవలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది.

మేఘాల ఉపరితలంపై ఉష్ణోగ్రతలను లెక్కించే నాసా ది అట్మాస్ఫెరిక్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సౌండర్‌ (ఎయిర్స్‌).. హుద్‌హుద్‌ తుఫాను వల్ల కలిగిన మేఘాల్లో ఉష్ణోగ్రతలనూ లెక్కించింది. అందులో అత్యంత శీతల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని నాసా పేర్కొంది. మేఘాల్లో మైనస్‌ 53 డిగ్రీల అతి శీతల స్థాయిలో ఉన్నట్లు ఎయిర్స్‌ గుర్తించింది. ఇంత అతి శీతల పరిస్థితుల వల్ల అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంటుందని నాసా హెచ్చరికలు జారీ చేసింది.

శుక్రవారం నాడు 138 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఎయిర్స్‌ రికార్డ్‌ చేసినా.. మరింత వికృత రూపం దాలుస్తాయని పేర్కొంది. హుద్‌హుద్‌ అక్టోబర్‌ 12న విశాఖ తీరాన్ని తాకుతుందని, అది భూమి మీదకు వచ్చేటప్పుడు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ప్రమాద ఘంటికలు మోగించింది.

ప్రస్తుతం అది విశాఖకు ఆగ్నేయంగా 155.3 మైళ్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు నాసా తెలిపింది. వాయువ్య దిశగా 11 కిలోమీటర్ల వేగంతో అది దూసుకొస్తుందని తెలిపింది. మరో రెండు రోజుల్లో అది పశ్చిమ-వాయువ్య దిశగా తుఫాను తన దిక్కును మార్చుకుంటుందని జాయింట్‌ టైఫూన్‌ వార్నింగ్‌ సెంటర్‌ తెలిపింది. నాసా హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

English summary
Reclassified as a "very severe cyclonic storm" by the India Meteorological Department (IMD), Hudhud continued to gather force ahead of reaching Visakhapatnam in Andhra Pradesh by Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X