Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Michaung: భారీ వర్షాలతో 12 మంది మృతి, చెన్నై అతలాకుతలం

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని మిచౌంగ్ తుఫాను అతలాకుతలం చేసింది. ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం జరిగింది. మిచౌంగ్ తుఫాను కారణంగా సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు చెన్నై నగరం, చుట్టుపక్కల జిల్లాలను వణికించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మంగళవారం నుంచి చెన్నైలోని చాలా ప్రాంతాలు వర్షాల నుంచి ఉపశమనాన్ని పొందాయి. దీంతో సహాయక సిబ్బంది ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి వీలు కలిగింది.

చెన్నైలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో ఫోర్‌షోర్ ఎస్టేట్‌లో 60 ఏళ్ల మహిళ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన 48 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షం సంబంధిత ఘటనల్లో గాయపడిన మరో పదకొండు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు వర్షాలు తగ్గడంతో చెన్నై విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

Cyclone Michaung: Death Toll At 12 in chennai, IMD Says Landfall In AP Completed

చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ నగరంలోని వరద ప్రాంతాలను సందర్శించి, తుఫాను కారణంగా ప్రభావితమైన ప్రజలకు సహాయక సామగ్రిని పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మైచాంగ్ తుఫాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ పూర్తయిందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.ఏపీలోని బాపట్ల తీరంలో మిచౌంగ్ తుపాను తీరం దాటింది.

మైచాంగ్ తుపాను తీరం దాటేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల తీరం వెంబడి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరించారు. ఏపీ తీర ప్రాంతంపైనా తుఫాను ప్రభావం ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆస్తి నష్టం జరిగినప్పటికీ.. ప్రాణ నష్టం జరగకుండా చూశారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

మిచౌంగ్ తుపానుపై సీఎం ఎంకే స్టాలిన్

మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చెన్నై సహా తొమ్మిది ప్రభావిత జిల్లాల్లో మొత్తం 61,666 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు స్టాలిన్ చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 11 లక్షల ఆహార ప్యాకెట్లు, లక్ష పాల ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.

చెన్నై నగర శివార్లలోని చెంబరంబాక్కం జలాశయం నుంచి అడయార్ నదిలోకి అనాలోచితంగా లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్లే 2015లో వరదలు సంభవించాయని.. ఇది మానవ నిర్మిత వరదలకు దారితీసిందని స్టాలిన్ ఎత్తిచూపారు. ప్రస్తుత పరిస్థితి, కుండపోత వర్షాల వల్ల సంభవించే సహజ వరదలను రాష్ట్రం సమర్ధవంతంగా నిర్వహించిందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+