గుజ్‌లో తీరం దాటనున్న ‘నీలోఫర్’: ఏపి, టీకి వర్షాలు
విశాఖపట్నం/అహ్మాదాబాద్: పశ్చిమ అరేబియా సముద్రంలో గుజరాత్‌కు నైరుతి దిశగా 1,165 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న పెను తుపాను ‘నీలోఫర్' అక్టోబర్ 31న తీరం దాటుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రంతోపాటు అహ్మాదాబాద్‌లోని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించాయి.
ప్రస్తుతం ఇది నైరుతి దిశగా పయనిస్తున్నప్పటికీ క్రమంగా దిశ మార్చుకుని ఈశాన్యానికి పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 31న గుజరాత్ రాష్ట్రంలోని నలియా వద్ద తీరం దాటే సమయానికి నీలోఫర్ క్రమంగా బలహీన పడే అవకాశం ఉందన్నారు. గుజరాత్‌లోని కచ్ తీర ప్రాంతంలో పెనుగాలులు, భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉందని, వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ, తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది.

గత రెండు రోజులతో పోలిస్తే సోమవారం వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. రుతుపవనాలు బంగాళాఖాతం నుంచి తెలంగాణ మీదుగా ధ్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు మునిగాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు చేరుకోవడం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా, తిరుమల శ్రీవారి క్షేత్రంలో సోమవారం వర్షం జోరుగా కురిసింది. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు తడిసిముద్దయ్యారు. ఆలయ పరిసరాలు సైతం జలమయమయ్యాయి.
సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని క్లోక్ రూం వద్ద, కేశఖండన శాల ప్రాంతాలు వర్షపునీటితో నిండిపోయాయి. దీంతో భక్తులు క్లోక్ రూం వద్దకు వెళ్లి సామాన్లు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడ్డారు.












Click it and Unblock the Notifications