తౌక్తే తుపానుకు ఆ పేరు ఎలా వచ్చిందో, అర్థమేంటో తెలుసా? -ఇప్పటికే బీభత్సం.. సర్వత్రా అలెర్ట్
కరోనా విలయానికి తోడు ఉప్పెనలా ముంచుకొస్తున్న తౌక్తే తుపాను నాలుగు రాష్ట్రాలను గజగజా వణికిస్తున్నది. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాధారణంగా తుపాన్లు సృష్టించే బీభత్సం, ఆస్తి, ప్రాణ నష్టం గురించి చెప్పుకోవడం కోసం ప్రతి తుపానుకు ఒక పేరు పెడుతుండటం తెలిసిందే. ఇప్పటి తుపానుకు తౌక్తే అని పేరు పెట్టడానికీ ఆసక్తికర కారణాలున్నాయి..

ప్రత్యేకమైన బల్లి అట..
బర్మా (మయన్మార్) భాషలో తౌక్తే (Tauktae) అంటే పెద్దగా శబ్దం చేసే బల్లి అని అర్థమట. 2021లో ఏర్పడ్డ ఈ తొలి తుఫాన్‌కు పేరు పెట్టే అవకాశం మయన్మార్‌కు లభించింది. దాంతో మయన్మార్ వాతావరణ విభాగం తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును ఈ తుఫానుకు పెట్టింది. సాధారణంగా ఆసియా ప్రాంతంలో ఏర్పడే తుపానులకు నామకరణం చేసే అవకాశం ఈ ప్రాంతంలోని దేశాలకు వంతుల వారీగా దక్కుతుంది.

2004నుంచి తుపాన్లకు పేర్లు..
తుపాన్లకు పేర్లు పెట్టే కార్యక్రమాన్ని వరల్డ్ మెటియరోలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్, పానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి. ఇందులో సభ్యదేశాలుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాలు ఉన్నాయి. 2004 నుంచి ఈ ప్రాంతంలో తుఫానులకు నామకరణం చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఈనెల 18న తీరానికి.. పకడ్బందీ చర్యలు
తౌక్తే తుపాను ఈ నెల 18న ఉదయం గుజరాత్ తీరాన్ని తాకనుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. తుపాను తీరాన్ని తాకేటప్పుడు గంటకు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈదురు గాలులకు తోడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం 79 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. మరో 22 బృందాలను పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చోటుకు తరలించేందుకు సిద్ధంగా ఉంచింది. ఎన్డీఆర్ఎఫ్‌తోపాటు ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్స్ కూడా సహాయక చర్యల్లో పాల్గొననున్నారు. సహాయక చర్యల కోసం పడవలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా వినియోగించనున్నారు.
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications