ముంచుకొస్తున్న 'తౌక్టే' తుఫాన్-12 గంటల్లో అతి తీవ్ర రూపం-ఆ 5 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు...
ఓవైపు కరోనాతో సతమతమవుతున్న వేళ మరోవైపు తుఫాను ముప్పు కలవరపెడుతోంది. తౌక్టే తుఫాను రానున్న 6 గంటల్లో తీవ్ర రూపం దాల్చవచ్చునని,12 గంటల్లో అతి తీవ్ర రూపం దాల్చవచ్చునని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ భారత్‌లో మొదట గుజరాత్ తీరాన్ని తాకవచ్చునని వెల్లడించింది.మంగళవారం మధ్యాహ్నం గుజరాత్‌లోని పోరుబందర్-నలియా ప్రాంతాల మధ్య తౌక్టే తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గుజరాత్ సహా మొత్తం ఐదు రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది.
Recommended Video

ఆ 5 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు....
తౌక్టే తుఫాన్ కేరళ,కర్ణాటక,తమిళనాడు,గుజరాత్,మహారాష్ట్రలపై ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో వచ్చే ఆదివారం వరకు కేరళ,కర్ణాటక,గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కొండచరియలు విరిగిపడటం,వరదలు పోటెత్తే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. మంగళవారం(మే 18) గుజరాత్‌లోని కచ్,సౌరాష్ట్ర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది.

రంగంలోకి దిగిన 50 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు
అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే 50 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను కేరళ,కర్ణాటక,తమిళనాడు,గుజరాత్,మహారాష్ట్రలలో మోహరించారు. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండే కేరళలోని వయనాడ్,ఇడుక్కి జిల్లాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం లక్ష ద్వీప్‌పై తుఫాన్ ప్రభావం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ శాఖ వెల్లడించింది. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్,ఆరెంజ్ అలర్ట్‌లను ప్రకటించారు.

సముద్రంలో వేటకి వెళ్లవద్దని హెచ్చరిక...
తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులెవరూ అరేబియా సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. టూరిజం కార్యకలాపాలపై కూడా ఆంక్షలు విధించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా... సహాయక చర్యల కోసం ఇండియన్ నేవీ షిప్స్ ఎయిర్‌క్రాఫ్ట్స్,హెలికాప్టర్స్,డైవింగ్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ టీమ్స్‌ను ఇప్పటికే సిద్దం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తుఫాన్ ప్రభావంపై శనివారం(మే 15) సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ముమ్మరంగా ముందు జాగ్రత్త చర్యలు
తుఫాన్ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేయబడ్డ తీర ప్రాంతాల్లోని 300 మందిని తిరువనంతపురంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మొత్తం 318 భవనాలను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసి తీర ప్రాంత ప్రజలను అక్కడికి తరలిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం(మే 15) సాయంత్రం తుఫాన్‌పై రివ్యూ నిర్వహించనుంది. తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంపై సమావేశంలో చర్చించనున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications