గుజరాత్‌కు మోదీ రూ.1000 కోట్ల సాయం -తౌక్తే తుపాను నష్టంపై సర్వే అనంతరం ప్రకటన -మహారాష్ట్ర సంగతేంటి?

కరోనా విలయానికితోడు అరేబియా సముద్రంలో పుట్టుకొచ్చిన తౌక్తే తుపాను తీర రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించింది. తుపాను తీరం దాటిన గుజరాత్ లోనైతే భీకర పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్‌లో తౌక్తే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలోనూ తుపాను అనంతర పరిస్థితిని ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు.

ఢిల్లీ నుంచి ఇవాళ ఉదయం గుజరాత్​లోని భావ్​నగర్​కు చేరుకున్న ప్రధాని మోదీ.. సీఎం విజయ్ రూపానీతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్​లో పర్యటిస్తూ ఆర్మెలీ, గిర్​సోమ్​నాత్​, భావ్​నగర్​ జిల్లాల్లో తుపాను కలిగించిన నష్టాన్ని అంచనా వేశారు. దీవ్​, ఉనా, జఫ్రాబాద్​, మహువాల్లోనూ మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం అహ్మదాబాద్‌ లో సీఎం, ఇతర ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. అందులో...

 Cyclone Tauktae: PM Modi announces Rs 1,000 cr for Gujarat, Rs 2 lakh to kin of deceased

తౌక్తే తుపాను కలిగించిన నష్టానికి తక్షణ ఆర్థిక సాయంగా గుజరాత్ కు కేంద్రం నుంచి రూ.1000కోట్లు అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. తుపాను వల్ల కలిగిన నష్టం నుంచి కోలుకునేలా గుజరాత్ కు అన్ని విధాలుగా సాయపడతామన్న ఆయన.. తౌక్తే మృతుల కుటుంబాలకు తలా రూ.2లక్షల పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి రూ. 50వేలు ఇస్తామని పేర్కొన్నారు.

 Cyclone Tauktae: PM Modi announces Rs 1,000 cr for Gujarat, Rs 2 lakh to kin of deceased

గుజరాత్ లో తౌక్తే ధాటికి 12 జిల్లాల పరిధిలో 45 మంది మృతి చెందారు.16 వేలకు పైగా ఇళ్లు ధ్వంసం కాగా.. 40 వేల చెట్లు, 70 వేలకు పైగా విద్యుత్ స్తంబాలు కూలిపోయినట్టు సీఎం రూపానీ వెల్లడించారు.

 Cyclone Tauktae: PM Modi announces Rs 1,000 cr for Gujarat, Rs 2 lakh to kin of deceased

నష్టం అచనాలు భారీగా ఉన్నప్పటికీ కేంద్రం కేవలం రూ.1000 కోట్లు మాత్రమే ప్రకటించడంతో అవి ఏమూలకు సరిపోని పరిస్థితి నెలకొంది. తౌక్తే తుపాను వల్ల మహారాష్ట్రలోనూ భారీ విధ్వంసం జరిగింది. ముంబై నగరంలో తీర ప్రాంతాల్లోని సముదాయాలు దెబ్బతిన్నాయి. మహారాష్ట్రకు కేంద్రం సహాయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+