వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యస్‌ తుఫాన్‌తో తీవ్ర నష్టం- బెంగాల్లో కోటి మందిపై ప్రబావం-కూలిన 3 లక్షల ఇళ్లు

|
Google Oneindia TeluguNews

భారత్‌లో తూర్పు తీరాన్ని వణికించిన యస్‌ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. ఉదయం 11.30 గంటల సమయంలో ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తుపాను తీరం దాటినా ఇంకా దాని ప్రభావం మాత్రం పశ్చిమబెంగాల్‌, ఒడిశాలపై కొనసాగుతోంది. అసలే చంద్రగ్రహణం రోజు కావడంతో తుపాను ప్రభావం మరికాస్త ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో తుపాను ప్రభావం అప్పుడే తగ్గినట్లు కాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతుండగా.. మత్సకారుల్ని సైతం చేపల వేటకు అనుమతించడం లేదు.
బెంగాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ కోటి మందిపై తుపాను ప్రభావం ఉందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

తీరం దాటినా తగ్గని యస్‌ తుపాను ముప్పు

తీరం దాటినా తగ్గని యస్‌ తుపాను ముప్పు

ఈ ఉదయం ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటినా యస్‌ తుపాను ముప్పు మాత్రం ఇంకా తొలిగిపోలేదు. దీనికి కారణం ఇవాళ చంద్రగ్రహణం కావడమే. చంద్రగ్రహణం సమయంలో వాతావరణం, సముద్ర మట్టాలపై తీవ్ర ప్రభావం ఉండనుండటంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశాతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంది. ఈ రోజు పౌర్ణమితో పాటు చంద్రగ్రహణం కూడా కావడంతో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం ప్రకటించింది. దీంతో తుపాను ముప్పు తప్పినా పూర్తిగా ప్రభావం తగ్గలేదని అర్దమవుతోంది. అయితే మరో మూడు గంటల్లో మాత్రం తుపాను బలహీన పడే అవకాశముందని అధికారులు ప్రకటించారు.

 తూర్పు తీరంలో భారీ వర్షాలు

తూర్పు తీరంలో భారీ వర్షాలు

ఇవాళ చంద్రగ్రహణం ప్రభావంతో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. ఈ సమయంలో సముద్రంలో పెను మార్పులతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రాల్లో వర్షపాతం అధికంగా ఉండొచ్చని అంచనా. దీంతో బెంగాల్, ఒడిశాతో పాటు ఏపీని కూడా అప్రమత్తం చేస్తున్నారు. యస్‌ తుపాను ధాటికి ఇప్పటికే బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రగ్రహణం కూడా తోడవడంతో ఎలాంటి ముప్పు ఎదురవుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

బెంగాల్లో కోటి మందిపై ప్రభావం

బెంగాల్లో కోటి మందిపై ప్రభావం

యస్‌ తుపాను కారణంగా ఒడిశా కంటే బెంగాల్‌ ఎక్కువగా ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. బెంగాల్లో కోటి మందిపై తుపాను ప్రభావం పడిందని, మూడు లక్షల ఇళ్లు నేలకూలాయని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. సాయంత్రం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రాష్ట్రంలో ప్రజల్ని అప్రమత్తం చేశామన్నారు. తుపాను ప్రభావంతో భారీగా చెట్లు కూడా నేలకూలాయి. లోతట్టు ప్రాంతాలు భారీగా జలమయం అయ్యాయి. బెంగాల్లో తుపాను కారణంగా కోట్లలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. తుపాను కారణంగా బెంగాల్‌, ఒడిశాకు రావాల్సిన విమానాలు రద్దయ్యాయి.

English summary
Cyclone Yaas: Landfall may have been completed but rainfall will continue till Thursday and fishermen are advised not to go to sea because conditions will be rough, an official from the Meteorological Centre in Bhubaneswar said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X