మూడు రాష్ట్రాలకు తుఫాన్ హెచ్చరికలు, 48 గంటల్లో చెన్నై తీరాన్ని తాకనున్న తుఫాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూడిల్లీ :తమిళనాడు, పాండిచ్చేరి,ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు తుఫాన్ ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో తుపాన్ ప్రభావం కన్పించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

చెన్నైకు తూర్పు దక్షిణ భాగంలోని 1070 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. పాండిచ్చేరిలోని తూర్పు ఈశాన్య, శ్రీలంకలోని త్రినాకోమలై ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరంలో తుపాన్ ఉన్నట్టు అధికారులు చెప్పారు.

ఆగ్నేయ బంగాళకాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరింత బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖాధికారులు చెప్పారు. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదికారుల ప్రకటించారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.

Cyclonic storm to hit Tamil Nadu coast on Dec 2


వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెప్పారు. డిసెంబర్ రెండవ తేదని కడలూరు సమీపంలోని వేదారణ్యం,చెన్నై మద్య తుఫాన్ తీరం దాటే అవకాశం ుందని వాతావరణ శాఖాధికారులు అంచనావేస్తున్నారు.


నాగపట్నం, కడలూరు, కారైకల్ ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్ రెండవ తేదిన పాండిచ్చేరి తీరానికి తుఫాన్ చేరే అవకాశం ఉందని దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు 48 గంటల తర్వాత తుఫాన్ చెన్నై తీరాన్ని దాటే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడ తుపాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

ఆంద్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు అంచ,నా వేస్తున్నారు. మత్య్సకారులు వేటకు వెళ్ళకూడదని అధికారులు కోరుతున్నారు. తుఫాన్ ప్రభావంతో మూడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.రెండు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురిసినా, ఎపిలో రెండు రాస్ట్రాల్లోనే దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cyclonic storm to hit Tamil Nadu coast on Dec 2
Please Wait while comments are loading...